మోడీ గురించి విక్టరీ వెంకటేష్ అలా కామెంట్ చేశాడా?

Victory Venkatesh shocking comments about Narendra Modi

01:25 PM ON 25th June, 2016 By Mirchi Vilas

Victory Venkatesh shocking comments about Narendra Modi

సినిమా ఫీల్డ్ లో అందునా టాలీవుడ్ లో చాలామంది నటీనటులు రాజకీయాలతో సంబంధం వున్నా, రాజకీయాలకు.. కామెంట్లకు దూరం పాటించడంలో ప్రముఖ టాలీవుడ్ నటుడు విక్టరీ వెంకటేష్ ఒకడు. అయితే అనుకోకుండా మన ప్రధాని మోడీ పై కామెంట్ చేయడం సంచలనం అయింది. ఇంతకీ అసలు విషయం ఏమంటే, భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గా అనిల్ కుంబ్లే నియామకంపై వెంకీ సోషల్ మీడియాలో హర్షం వ్యక్తం చేశాడు. భారత ప్రధాన కోచ్ గా ఏడాది పాటు నియామకమైనందుకు అనిల్ కుంబ్లేకి అభినందనలు. ఇది సరైన ఎంపికగా నేను భావిస్తున్నా.

ప్రధాని మోదీ నినాదించిన మేకిన్ ఇండియా వైపు భారత్ నడుస్తోందనడానికి నిదర్శనం ఈ ఎంపికే అంటూ వ్యాఖ్యానించాడు. జాబితాలో టామ్ మూడీ, స్టువర్ట్ లా లాంటి అనుభవజ్ఞులైన విదేశీ కోచ్ లు ఉన్నా భారత్ కు చెందిన క్రికెటర్ నే ఎంపిక చేయడంపై వెంకీ తన సంతోషాన్ని పరోక్షంగా వ్యక్తం చేశాడని సోషల్ మీడియాలో వెంకీ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.

English summary

Victory Venkatesh shocking comments about Narendra Modi