ట్విట్టర్‌ టైమ్‌లైన్‌లో వీడియో యాడ్స్‌

Video Adds To Display On Twitter

12:45 PM ON 11th February, 2016 By Mirchi Vilas

Video Adds To Display On Twitter

ఇకఫేస్ బుక్ బాటలోనే ట్విట్టర్‌ కూడా నడుస్తోంది. ఇకపై అమెరికాలో ట్విట్టర్ వినియోగదారుల టైమ్‌లైన్‌లో వీడియో ప్రకటనలు దర్శనమివ్వనున్నాయి. వినియోగదారులు తొలిసారి చూసే ప్రదేశం (ఫస్ట్‌ వ్యూ)లో వీటిని ఉంచనున్నారు. కంపెనీ ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా ఈ విషయాన్ని ప్రకటించింది. ఈ నిర్ణయం వల్ల ట్విట్టర్‌ ఆదాయం పెరగవచ్చు కానీ.. కొంత వ్యతిరేకత రావచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే ట్విట్టర్లో ప్రకటనలు వస్తున్నాయి. కానీ వీటి ఆల్గారిథమ్స్‌ సంబంధిత వినియోగదారులనే లక్ష్యంగా చేసుకుంటాయి. కానీ ఇప్పుడు కొత్త నిర్ణయం వల్ల ఒక నిర్ణీత ప్రాంతంలో ట్విట్టర్‌ ఓపెన్‌ చేసిన ప్రతి ఒక్కరు ఈ వీడియోని వీక్షిస్తారు. ఈ నేపథ్యంలో ప్రకటన ఇచ్చిన సంస్థకు బాగా ప్రచారం లభిస్తుందని చెబుతోంది.

English summary

The social media site will let people turn on a setting that lets popular tweets related to people you follow show up first in your timeline, followed by the real-time feed most people on Twitter are used to.