ఫేస్‌బుక్‌ ముమెంట్స్‌లో వీడియో షేరింగ్‌ 

Video Sharing Feature In Facebook Moments

03:59 PM ON 2nd March, 2016 By Mirchi Vilas

Video Sharing Feature In Facebook Moments

ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్‌కి చెందిన ఫొటో షేరింగ్‌ యాప్‌ ముమెంట్స్‌లో ఇక వీడియో షేరింగ్‌ కూడా చేయొచ్చు. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ స్మార్ట్ ఫోన్లకు ఈ సదుపాయం ప్రస్తుతం అందుబాటులోకి వచ్చింది. సరికొత్త అప్‌డేట్‌తో ఈ యాప్‌లో వీడియో షేరింగ్‌తోపాటు మెరుగైన అప్‌లోడింగ్‌ సెట్టింగ్స్‌, స్లైడ్‌షో, వెయిట్‌ ఫర్‌ వైఫై తదితర కొత్త ఫీచర్లు అందుబాటులోకి తీసుకొచ్చింది ఫేస్ బుక్. ఈ ఫీచర్లు త్వరలో వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయంటూ ఫేస్ బుక్ కొద్ది రోజుల క్రితమే వెల్లడించింది. తాజాగా ఇప్పుడు ఇవి అందుబాటులోకి వచ్చాయి. గత జూన్‌లో ఈ యాప్‌ విడుదల కాగా ఇప్పటి వరకు 400 మిలియన్‌ ఫొటోలు దీని ద్వార షేర్‌ అయ్యాయి.

English summary

World's Popular Social Networking Site Facebook's Moments app gets a new update in which now we can share Videos from this App. The new feature is now available to users on iOS as well as Android devices.