వీడియోకాన్‌ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌

Videocon Z55 Krypton Launched

02:55 PM ON 19th December, 2015 By Mirchi Vilas

Videocon Z55 Krypton Launched

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉపకరణాల తయారీ సంస్థ వీడియోకాన్‌ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది. వీడియోకాన్‌ జడ్‌ 55 క్రిప్టన్ పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని ధర రూ. 7,999గా సంస్థ ప్రకటించింది. 5 అంగుళాల టచ్‌స్క్రీన్‌ డిస్‌ప్లే ఉన్న ఈ ఫోన్ లో 13 మెగా పిక్సల్ వెనుక కెమెరా ఉంది. 1 జీబీ ర్యామ్ 1.3 గిగాహెడ్జ్‌ క్వాడ్ కోర్ ప్రొసెసర్‌, 5 మెగా పిక్సల్ ముందు కెమెరా, 4జీ సపోర్టింగ్, డ్యుయల్‌ సిమ్‌, డ్రాగన్ ట్రెయిల్ గ్లాస్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్‌ 5.1 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ పై పనిచేస్తుంది. ఇందులో 2200 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 8 జీబీ అంతర్గత మెమరీ సామర్థ్యాన్ని ఎస్డీ కార్డ్ సహాయంతో 32 జీబీ వరకు పెంచుకోవచ్చు. వీసేఫ్ యాప్ ను ప్రీలోడెడ్ గా అందిస్తున్నారు. అలాగే.. వీ సెక్యూర్ యాప్ ను 60 రోజుల పాటు ఉచితంగా వాడుకున వీలుంది.

English summary

Videocon Mobiles Company launched the Videocon Z55 Krypton 4G enabled smartphone. A 5-inch HD (720x1280 pixels) IPS display with Dragontrail X Glass, and is powered by a 1.3GHz quad-core processor alongside 1GB of RAM, 8GB internal Storage