హాస్పటల్‌ లో చేరిన 'విద్యాబాలన్‌'!

Vidya Balan joined in hospital

03:22 PM ON 31st December, 2015 By Mirchi Vilas

Vidya Balan joined in hospital

సాంప్రదాయ పాత్రల్లో అలరించిన విద్యాబాలన్‌ ఆ తరువాత అవసరమైతే అందాలు కూడా ఆరబోయగలనని నిరూపించింది. 'డర్టీ పిక్చర్' చిత్రంలో తన అందాల ఆరబోతకు, నటనకు గానూ నేషనల్‌ అవార్డు గెలుచుకున్న విద్య ఆ తరువాత చాలా సినిమాల్లో నటించింది. ఆ తరువాత పెళ్లి కూడా చేసుకుంది కానీ సినిమాలకి మాత్రం గుడ్‌బై చెప్పులేదు. 2015లో విద్య నటించిన 'హమారీ అధూరీ కహానీ' చిత్రం తప్ప మరే చిత్రంలోనూ నటించలేదు. ప్రస్తుతం తన చేతిలో సినిమాలు కూడా ఏమీ లేవు. అయితే రేపు (జనవరి1) విద్య పుట్టినరోజు సందర్భంగా తన భార్య పుట్టినరోజును గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చెయ్యాలని భావించిన విద్య భర్త సిద్ధార్ధారాయ్‌కపూర్‌ ఓ విదేశీ టూర్‌ ఫ్లాన్‌ చేశాడు.

అందుకోసం ఏర్పాట్లు కూడా చేసేశాడు, న్యూయార్క్‌లో తన పుట్టిన రోజుని, న్యూయర్‌ని సెలబ్రేట్‌ చెయ్యడం కోసం ముంబాయి విమాన ఆశ్రమానికి బయల్దేరింది ఈ జంట. విమానం కూడా ఎక్కేశారు, మరి కొద్ది సేపట్లో ఫ్లయిట్‌ స్టార్ట్‌ అవుతుందనగా విద్యాకి వీపు నొప్పి రావడంతో వెంటనే ఫ్లయిట్‌ దిగిపోయారట. విద్యని హాస్పటల్‌లో చేర్పిస్తే కిడ్నిలో రాళ్లు ఉన్నాయని చెప్పారట. విద్య ప్రస్తుతం హాస్పటల్‌ లో చికిత్స చేయించుకుంటుంది.

English summary

Vidya Balan joined in hospital due to stones in kidney.