ఇందిరాగాంధీ పాత్రకోసం విద్యాకు 18 కోట్లు!

Vidya Balan taking 18 crores remuneration for Indira Gandhi movie

01:12 PM ON 6th August, 2016 By Mirchi Vilas

Vidya Balan taking 18 crores remuneration for Indira Gandhi movie

మనుషుల జీవితాలను ముఖ్యంగా ప్రముఖుల జీవిత చరిత్రలను ఆధారం చేసుకుని సినిమాలు తీసే విధానం ఎప్పటినుంచో వుంది. స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్న నేతలు, వీరుల జీవిత గాధలను ఆధారం చేసుకుని ఎన్నో పిక్సర్స్ వచ్చాయి. ఇక బాలీవుడ్ లో కొన్నేళ్లుగా బయోపిక్ ల హవా నడుస్తోంది. జీవిత కథల ఆధారంగా తీసిన సినిమాలు బాక్సాఫీసులను కొల్లగొట్టాయి. ముఖ్యంగా లేడీ ఓరియంటెడ్ బయోపిక్ లయితే వందకోట్ల వసూళ్ల జాబితాలో సైతం రికార్డులు సృష్టించాయి. సిల్క్ స్మిత, మేరీకోమ్, కహానీ, సరబ్ జిత్ చిత్రాలు వంద కోట్ల రూపాయల వసూళ్లు సాధించి తమకు తిరుగులేదని చాటాయి.

1/4 Pages

ఇప్పటివరకు సినీనటులు, క్రీడాకారుల జీవితాల ఆధారంగా బాలీవుడ్ చిత్రాలు నిర్మించింది. కానీ రాజకీయ నాయకుల జీవిత కథల ఆధారంగా బాలీవుడ్ లోని ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ తొలిసారి బయోపిక్ నిర్మించడానికి రంగం సిద్ధం చేసింది. దేశ చరిత్రలో అత్యంత వివాదాస్పద ప్రధానమంత్రిగా, ఉక్కుమహిళగా పేరుగడించిన ఇందిరాగాంధీ జీవితం ఆధారంగా ఈ చిత్రం నిర్మాణం కానుంది. ఈ చిత్రంలో ఇందిరాగాంధీగా విద్యాబాలన్ నటించనున్నట్లు చెబుతున్నారు. ఈ సినిమాలో నటిస్తే.. విద్యాబాలన్ కు సదరు నిర్మాణ సంస్థ రికార్డు స్థాయిలో అంటే, రూ. 18 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వనున్నట్లు టాక్ నడుస్తోంది. ఇందిరాగాంధీగా చేయాలంటే గొప్ప ఆహార్యం, గాంభీర్యంతో పాటు అత్యంత నటనా సామర్థ్యం కూడా అవసరం అని భావించిన నిర్మాతలు ఈ పాత్రకు విద్యా బాలన్ అయితేనే, కరెక్ట్ గా సరిపోతుందని భావించి.. ఆమె డిమాండ్ చేసినంత రెమ్యునరేషన్ ఇచ్చి మరీ ప్రాజెక్టు ఓకే చేసినట్లు చెబుతున్నారు.

English summary

Vidya Balan taking 18 crores remuneration for Indira Gandhi movie