కాలుష్యం నివారణకు 20 వేల విద్యుత్‌ టాక్సీల దిగుమతి

Vietnam To Import Electric Taxis From France

03:56 PM ON 19th December, 2015 By Mirchi Vilas

Vietnam To Import Electric Taxis From France

తమ దేశంలో పెరిగిపోతున్న వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు వియత్నాం నడుంబిగించింది. ఇందుకోసం దాదాపు 20 వేల విద్యుత్‌ టాక్సీలను ఫ్రాన్స్‌ నుండి దిగుమతి చేసుకోవాలని నిర్ణయించింది. వాహనాల నుండి వెలువడే కర్బన ఉద్గారాలను నియంత్రించే దిశగా వియత్నాం తొలి అడుగు వేసింది. వియత్నాంకు చెందిన మైలిన్‌ టాక్సీస్‌, ఆటోమోటార్స్‌ సంస్థలు ఫ్రాన్స్‌కు చెందిన రేనాల్ట్‌ సంస్థతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నాయని, త్వరలోనే రేనాల్ట్‌ సంస్థ ఉత్పత్తి చేసిన జెడ్‌ఓఇ, జెడ్‌ఇ కార్లు ఎగుమతి ప్రారంభమవుతుందని వియత్నాం మీడియా పేర్కొంది. అంతర్జాతీయ సమాజం మద్దతుతో 2030 నాటికి కర్బన ఉద్గారాల విడుదలను 25 శాతం మేర తగ్గించాలని ఇటీవల పారిస్‌లో ముగిసిన 21వ వాతావరణ మార్పుల సదస్సులో ప్రపంచ దేశాలు అవగాహనకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఒప్పందం మేరకు కాలుష్య నియంత్రణ దిశగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు వియత్నాం ప్రకటించింది.

English summary

Vietnam Country To Import 20 thousand Electric Taxis ,autos From France. Vietnam has signed with france automobile company Renault. This step was taken because of there is rise pollution in the country