'బాహుబలి' రికార్డుని బద్దలు కొట్టేసాడు!

Vijay breaks Baahubali records

03:17 PM ON 8th February, 2016 By Mirchi Vilas

Vijay breaks Baahubali records

తమిళ స్టార్ హీరో విజయ్‌ తాజా చిత్రం 'తెరి' టీజర్‌ ప్రస్తుతం యూట్యూబ్‌లో ఒక ఊపు ఊపుతుంది. ఈ టీజర్‌ యూట్యూబ్‌లో పెట్టిన వెంటనే అజిత్‌ 'వేదాలం' టీజర్‌ రికార్డుని బద్దలు కొట్టేయగా, ఇప్పుడు రాజమౌళి 'బాహుబలి' రికార్డుని కూడా తుడిచి పెట్టేసింది. అసలు విషయంలోకి వస్తే బాహుబలి రిలీజ్‌ టైంలో దానికి సంబంధించిన టీజర్‌కి అత్యధిక వ్యూలు, లైక్‌లు, హిట్లు వచ్చి రికార్డు సృష్టించింది. ఆ తరువాత 'నాన్నకు ప్రేమతో' టీజర్‌ 4 నెలల్లో 40 లక్షలు వ్యూలు వచ్చి 'బాహుబలి' రికార్డుని బద్దలు కొట్టేసింది. ఇప్పుడు ఆ రికార్డుని విజయ్‌ 'తెరి' టీజర్‌ 12 గంటల్లో 10 లక్షల వ్యూలు, 1.3 లక్షల లైకులుతో రికార్డు సృష్టించింది. ఆ తరువాత 'నాన్నకు ప్రేమతో' రికార్డుని కేవలం 2 గంటల్లోనే బద్దలు కొట్టేసింది.

టీజర్‌తోనే విజయ్‌ ఇన్ని రికార్డులని బద్దలు కొడుతుంటే, ఇంక చిత్రం విడుదల తరువాత ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడతాడో చూడాలి.

English summary

Tamil star hero Vijay breaks Baahubali records with his latest movie teaser Theri. It now creates record in youtube within 12 hours.