మీనా కూతురే  విజయ్ కూతురట 

Vijay daughter in theri movie is heroine Meena's daughter

09:22 AM ON 23rd March, 2016 By Mirchi Vilas

Vijay daughter in theri movie is heroine Meena's daughter

ఇటీవల టీజర్ విడుదల చేసిన కొద్ది గంటల్లోనే అత్యధిక వీక్షకులు చూసిన టీజర్ గా తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన 'తేరి' చిత్రం నిలిచింది. ఇలాంటి అద్భుత రికార్డు క్రియేట్ చేసిన 'తేరి' ఏప్రియల్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక పోస్టర్ లు పిచ్చ పిచ్చ గా నచ్చేయడంతో రిపీట్ గా వీక్షిస్తున్నారు. ఈ పోస్టర్ లో విజయ్ పక్కన ఓ పాప కనిపిస్తుంది. ఇంతకీ ఈ పాప ఎవరై ఉంటుందా అనే చర్చ కూడా జోరుగా సాగుతోంది. ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ రంగ ప్రవేశం చేసి, టాప్ హీరోయిన్ రేంజి అందుకుని, దుమ్ము రేపిన మీనా కూతురే, విజయ్ పక్కన కనిపిసున్న చైల్డ్ ఆర్టిస్ట్ అని తేల్చారు. పెళ్లై పిల్లలు కూడా ఉన్న ఈమె ఇంటికి ఓ కధ వినిపించడానికి ఇటీవల డైరెక్టర్ అట్లీ వెళ్ళాడట.

తనకోసమే వచ్చాడని మీనా అనుకుందట. నటించడానికి కూడా ఓకే చెప్పేసిందట. తీరా తన కూతురు ని ఈ సినిమాలో నటించమని అడిగేసరికి కాస్త ఖంగు తిన్నా, సర్ది చెప్పడంతో ఆ తర్వాత ఒప్పుకుందట. ఆ పాప వయస్సు ప్రస్తుతం 4 ఏళ్ళు..... పేరు నైనికా... ఆ విధంగా ఒప్పించడంతో విజయ్ కూతురుగా నైనికా నటించనుంది. చిత్రం ఏమంటే, స్టోరీ మొత్తం నైనికా చుట్టూ తిరుగుతుంది. దీంతో దాదాపు 40 సీన్లలో నైనికా కనిపించనుంది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ చిత్రంలో సమంత, అమీ జాక్సన్ హీరోయిన్లు గా నటించారు.

English summary

Vijay daughter in theri movie is heroine Meena's daughter. Vijay latest movie Theri trailer is released 1 day before. This movie is directed by Raju Rani fame Atlee.