'విక్రమ్‌'తో విజయ్‌ జోడి..

Vijay is acting with Vikram

05:43 PM ON 9th January, 2016 By Mirchi Vilas

Vijay is acting with Vikram

కోలీవుడ్‌ స్టార్ హీరో విక్రమ్‌ ఎనెర్జిటిక్‌ హీరో మాత్రమే కాదు, షాట్‌ పర్ఫెక్ట్‌గా రావడానికి తన శక్తినంతా దారపోస్తాడు. ప్రస్తుతం ఈ స్టార్‌ హీరో 'స్పిరిట్‌ ఆఫ్‌ చెన్నై' సాంగ్ షూటింగ్‌ లో బిజీగా ఉన్నాడు. మరోవైపు విక్రమ్‌ సాంగ్‌ పై చాలా ఆలోచనలు రెకెత్తుతున్నాయి. తాజా వార్తల ప్రకారం ఈ సాంగ్‌ లో ఫేమస్‌ బాలీవుడ్‌ స్టార్స్‌ మెరవబోతున్నారని తెలిసింది. బాలీవుడ్‌ స్టార్‌ హీరో అభిషేక్‌ బచ్చన్‌ ఉన్నాడని సమాచారం. ఈ సాంగ్‌ యొక్క విజువల్స్‌, కాన్సెప్ట్‌ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తాయని విమర్శకులు సైతం గట్టిగా నమ్ముతున్నారు. తమిళ స్టార్‌ హీరో విజయ్‌ మరియు విక్రమ్‌ బాగా సన్నిహితులు అని అందరికీ తెలిసిన విషయమే.

విజయ్ కూడా ఈ సాంగ్‌ లో కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయం అధికారికంగా ప్రకటించలేదు.

English summary

Tamil star hero Vijay is acting with Vikram in Spirit of Chennai video song.