విజయ్ మాల్యాకు గట్టి షాక్... 6,630 కోట్ల ఆస్తి జప్తు!

Vijay Mallya assets was seized

06:03 PM ON 3rd September, 2016 By Mirchi Vilas

Vijay Mallya assets was seized

బాంకులకు రుణాల ఎగ్గొట్టి విదేశాల్లో తలదాచుకున్న విజయ్ మాల్యాకు గట్టి షాక్ ఇచ్చారు. మాములుగా కాదు, ఈ షాక్ ప్రభావం భారీగానే పడిందని చెప్పవచ్చు. ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) శనివారం ఆయనకు సంబంధించిన రూ.6,630 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. ముంబై, బెంగళూరు సహా దేశవ్యాప్తంగా ఈ ఆస్తులు ఉన్నాయి. ఈడీ జప్తు చేసిన ఫామ్ హౌస్ మహారాష్ట్రలో ఉంది. దీని విలువ దాదాపు రూ. 200 కోట్లు ఉంటుందని అంచనా. బెంగళూరులోని రూ.800 కోట్ల విలువైన అపార్టుమెంట్, మాల్ లను కూడా ఈడీ జప్తు చేసింది. వీటితో పాటు రూ.3 వేల కోట్ల విలువైన షేర్లను కూడా జప్తు చేసింది.

రూ.9 వేల కోట్ల రూపాయల మేరకు రుణాలను మాల్యా ఎగవేశారని బ్యాంకులు ఆరోపిస్తున్నాయి. మార్చిలో భారతదేశం నుంచి వెళ్ళిపోయిన మాల్యా ప్రస్తుతం లండన్ లో ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే ఆయన పాస్ పోర్టును ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇక స్వదేశానికి రప్పించడమే తరువాయి.

ఇది కూడా చదవండి: ప్రేమించడం లేదని క్లాసులోనే కొట్టి చంపేశాడు.. ఆపై..

ఇది కూడా చదవండి: మీ నాలుకపై ఉండే మచ్చలు బట్టి మీరెలాంటి జబ్బులతో బాధపడుతున్నారో తెలుసుకోవచ్చు!

ఇది కూడా చదవండి: మీ గోళ్లపై పసుపుపచ్చ మచ్చలు ఉన్నాయా? అయితే ఇలా చేస్తే తొలగిపోతాయి..

English summary

Vijay Mallya assets was seized