కింగ్‌ఫిషర్‌ పతనం యుపీఎ వల్లేనట 

Vijay Mallya blames UPA for Kingfisher's failure

11:44 AM ON 12th December, 2015 By Mirchi Vilas

Vijay Mallya blames UPA for Kingfisher's failure

లిక్కర్‌ కింగ్‌ విజయ్‌మాల్యా ఒకప్పుడు కింగ్‌లా బతికినా, ఇప్పుడు మాత్రం పీకల్లోతు అప్పుల్లో కూరుకుని సతమతమవుతున్నాడు. కొండల్లా పేరుకుపోతున్న అప్పులను తీర్చేందుకు నానా యాతనలు పడుతున్న మాల్యా వెంట కోట్లాది అప్పులిచ్చిన బ్యాంకులు, కేసుల పేరిట సిబిఐ వంటి విచారణ సంస్థలు వెంటపడుతున్నాయి. ఎప్పుడూ డజనుకుపైగా సుందరాంగులను వెంట పెట్టుకుని జల్సాగా తిరిగే మాల్యా ఇప్పుడు లాయర్లను వెంటేసుకుని తిరిగే పరిస్థితి వచ్చింది. సిబిఐ చుట్టూ కేసుల గొడవతో తిరుగుతున్న విజయ్‌మాల్యా తన కింగ్‌ఫిషర్‌ సంస్థ పతనానికి కారణం యుపీఏ ప్రభుత్వానిదే నంటూ బాంబు పేల్చాడు. అప్పట్లోని యుపీఎ ప్రభుత్వం జెట్‌ ఎయిర్‌వేస్‌, ఎయిర్‌ ఇండియాలకు బాగా అనుకూలమైన నిర్ణయాలను తీసుకోవడం వలన కింగ్‌ఫిషర్‌ సంస్థ కుప్పకూలిందనేది విజయ్‌మాల్యా వాదన. గురువారం నాడు సిబిఐ ముందు హాజరు అయిన విజయ్‌మాల్యా ఈ విషయాలను సిబిఐకు వివరించాడు. ఐడిబిఐ బ్యాంకుకు సంబంధించి 900కోట్ల రూపాయల రుణాన్ని కింగ్‌ఫిషర్‌ సంస్థ ఎగ్గొట్టడంతో విజయ్‌మాల్యా ఈ కేసుకు సంబంధించి సిబిఐ విచారణకు రావాల్సివచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఆయిల్‌ ధరలకు రెక్కలు రావడం, రూపాయి విలువ మరింతగా పతనం అవ్వడమే ప్రధానకారణాలుగా విజయ్‌మాల్యా చెప్పుకొచ్చాడు. 2008లో ఆర్ధికశాఖా మంత్రి పి.చిదంబరం తీసుకున్న నిర్ణయాల కారణంగా ఆర్ధిక సంక్షోభం నెలకొందని, ఆ సంక్షోభంతో కింగ్‌ఫిషర్‌ పతనానికి చేరుకుందని వాపోయాడు. నిబంధనలకు విరుద్ధంగా , తన స్థాయికి మించి రుణాలను పొందిన కేసులో విజయ్‌మాల్యా సిబిఐ చుట్టూ తిరుగుతున్నాడు. త్వరలోనే తాను అప్పులన్నీ తీర్చేయనున్నట్లు నమ్మకంతో చెప్పిన విజయ్‌మాల్యా తదనంతరం రిటైర్‌మెంట్‌ తీసుకోనున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి.

English summary

Vijay Mallya has blamed the UPA government for favoring Jet Airways and Air India as the result of Kingfisher's failure.