నన్ను ఏమైనా అనండి ... నా కొడుకుని అన్నారో ...

Vijay Mallya Files Petetion On Supreme Court

10:14 AM ON 31st March, 2016 By Mirchi Vilas

Vijay Mallya Files Petetion On Supreme Court

అబ్బో , ఈ లిక్కర్ కింగ్ కి పుత్రుడంటే ఎంత ప్రేమో మరి ... కుమారుడు ని ఒక్కమాట అన్నారో అంటూ వార్నింగ్ ఇస్తున్నాడు ... వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకుని 17 బ్యాంకులకు టోకరా వేసి లండన్ వెళ్లిపోయిన కింగ్ ఫిషర్ విజయ్ మాల్యా ఈ విషయంలో తనను ఎన్ని అనుకున్నా ఫరవాలేదని... తన కుమారుడిని మాత్రం ఒక్క మాట కూడా అనొద్దని అంటున్నాడు. రుణాల చెల్లింపు కేసులో తన కుమారుడు సిద్ధార్థ మాల్యాను ఎందుకు విమర్శిస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. బ్యాంక్ రుణాలు ఎగ్గొట్టిన కేసులో సిద్ధార్థ మాల్యా తప్పేమీలేదని ఆయన చెప్పారు. రుణాలు చెల్లించాల్సింది తానే కానీ సిద్ధార్థ కాదని... తిట్టాలనుకుంటే తనను తిట్టాలి కానీ సిద్ధార్థ ను మాత్రం తిట్టొద్దని స్పష్టం చేసారు. ఈమేరకు  ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి : 

ఎపి అసంబ్లీలో 'కంచె'

పోలీసులకే టోకరా వేసి , లక్షలు గుంజిన ఆటోవాలా

1/3 Pages

రుణాలు తీరుస్తాడట .....

కాగా  మాల్యా తన కేసు విషయంలో నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బ్యాంకులు ఇచ్చిన రుణాలను తప్పకుండా తీరుస్తానని పిటిషన్ దాఖలు చేశారు. మాల్యా దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కురియన్ నేతృత్వంలోని సింగిల్ జడ్జి బెంచ్ ముందు జరిగిన ఈ విచారణలో మాల్యా తరఫు న్యాయవాది కీలక ప్రతిపాదన చేశారు. తొలి విడతగా రూ.4 వేల కోట్లను చెల్లించేందుకు మాల్యా సిద్ధంగా ఉన్నారట. సెప్టెంబర్ లోగా ఈ చెల్లింపులను పూర్తి చేస్తారని లాయర్ అన్నారు.  వాదనలు విన్న తర్వాత కేసును ఏప్రిల్ ఏడో తేదీకి వాయిదా వేశారు. మరి ఇది ఎత్తుగడో , తప్పించుకునే యత్నమో తేలాల్సి వుంది.

English summary

Liquor King Vijay Mallya File Petetion On Supreme Court. Vijay Mallya Lawyer says that Vijay Mallya was ready to pay 4 Thousand crores to banks. Vijay Mallya says that dont comment his son Siddarth Mallya on this issue.