మీడియా పై బాంబు పేల్చిన మాల్యా

Vijay Mallya Fires On Media

05:41 PM ON 11th March, 2016 By Mirchi Vilas

Vijay Mallya Fires On Media

ఎవరైనా సరే, పొగిడినపుడు ఎంత పొంగిపోతామో,  విమర్శ వచ్చినా తేలిగ్గా తెసుకోవాలి. అది స్పోర్టీవ్ నెస్ అంటే ... కానీ పొగడ్తలకు బాగా అలవాటు పడిపోయిన వాళ్ళు విమర్శ అసలు తట్టుకోలేరు. అందుకే అలాంటి వాళ్లకు విమర్శ  చెడ్డ చిరాకు పుట్టిస్తుంటుంది. అందునా కింగ్ ఫిషర్  విజయ్ మాల్యా లాంటి ప్లేబాయ్ బిజినెస్ మ్యాన్ కి ఇంకెంత ఒళ్లు మండుతుందో చెప్పాల్సిన అవసరం లేదు. దేశం వదిలి గుట్టుచప్పుడు కాకుండా వెళ్ళిపోయిన మాల్యా పై  వస్తున్న విమర్శల్ని ఆయన ఏ మాత్రం తట్టుకోలేకపోతున్నారు. అయ్యగారి భాగోతం ఒక్కొక్కటి బయటపెడుతున్న మీడియా మీద ఆయన ఆగ్రహం తో ఊగిపోతున్నారు. అంతేకాదు  తాజాగా ట్విట్టర్ లో ట్వీట్ల రూపంలో మీడియా పెద్దలపై విరుచుకు పడ్డారు.

1/4 Pages

కొందరు మీడియా అధినేతలకు తాను చేసిన సాయం గురించి ఆయన ప్రస్తావిస్తూ,  గతంలో మీడియా అధిపతులకు తాను చేసిన సాయం.. ఫేవర్స్ ను మర్చి పోయినట్లున్నారంటూ అక్కసు వెళ్లగక్కిన మాల్యా.. మీడియా అధినేతలు తనను ఉద్దేశ్యపూర్వకంగా డీఫేమ్ చేస్తున్నట్లు ఆరోపించారు. ఏళ్ల తరబడి తాను చేసిన సాయం గురించి,  ఆధారాలు డాక్యుమెంట్ల రూపంలో తన వద్ద వున్నాయంటూ బాంబు పేల్చారు. టీఆర్పీ రేటింగ్స్ కోసం ఇప్పుడు అబద్ధాలు చెబుతారా? అంటూ మీడియాపై విరుచుకుపడ్డారు. 

English summary

Liquor king Vijay Mallya fires on media for the false Campaign against him.He fires on the Times Now editor for speaking against him.He says that he favoured soo many media people and they were forgetting that thing.