రాజ్యసభకు లిక్కర్‌ కింగ్‌ రాజీనామా

Vijay Mallya resigns to Rajya Sabha

12:04 PM ON 3rd May, 2016 By Mirchi Vilas

Vijay Mallya resigns to Rajya Sabha

పలు ప్రభుత్వరంగ బ్యాంకులకు 9వేల కోట్లకుపైగా బకాయిపడిన లిక్కర్‌ కింగ్,ఎంపీ విజయ్‌ మాల్యా తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.రాజ్యసభ చైర్మన్‌ హమిద్‌ అన్సారీకి ఆయన సోమవారం తన రాజీనామా లేఖ పంపారు. తన పేరూ, ప్రతిష్ఠ మరింత మంటకలవడం తనకిష్టం లేకనే రాజీనామా చేస్తున్నాననీ మాల్యా పేర్కొన్నారు.‘‘చట్టబద్ధంగా విచారణ జరిగి నాకు న్యాయం జరగదని ఇటీవలి సంఘటనలు సూచిస్తున్నందున నేను తక్షణమే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను’’ అని ఆ లేఖలో వివరించారు. రాజ్యసభ ఎథిక్స్‌ కమిటీ మాల్యాను సభ నుంచి బహిష్కరిస్తూ, మంగళవారం సిఫారసు చేయనుండగా, ఒకరోజు ముందే స్వయంగా ఆయనే తప్పుకున్నారు. కాగా, రెండోవిడత ఎంపీగా ఇండిపెండెంట్‌గా గెలిచిన మాల్యా పదవీకాలం వాస్తవానికి జూలై 1న ముగియనుంది.

ఇవి కూడా చదవండి: భార్య డాన్స్ చేసిందని.. ఆమెను భర్త ఏం చేసాడో తెలుసా?

ప్రభుత్వరంగ బ్యాంకులకు రూ.9,400 కోట్లకుపైగా రుణాలు ఎగవేసి బ్రిటన్‌ పరారైన మాల్యాపై సుప్రీంకోర్టులో కేసు విచారణ జరుగుతోంది. ఆయణ్ని భారతకు రప్పించే ప్రయత్నాలలో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఇప్పటికే నోటీసులు జారీ చేసింది కూడా. కాగా ఎంపీ అయినందున మాల్యా వ్యవహారాన్ని ఎగువసభలోని ఎథిక్స్‌ కమిటీ చేపట్టింది. మంగళవారం జరిగే ఎథిక్స్‌ కమిటీ సమావేశంలో మాల్యాను రాజ్యసభ నుంచి బహిష్కరిస్తూ సిఫారసు చేయాలని ఏప్రిల్‌ 25 నాటి భేటీలోనే సభ్యులు ఏకగ్రీవంగా నిర్ణయించారు.

ఇవి కూడా చదవండి: శవంతో కోరిక తీర్చుకున్న కామాంధుడు

ఎథిక్స్‌ కమిటీ సిఫారసుకు రాజ్యసభ ఆమోదం తెలపడం లాంఛనప్రాయమే కాబట్టి మాల్యా పరిస్థితి గ్రహించి రాజీనామా లేఖ పంపారు. ఎథిక్స్‌ కమిటీ చైర్మన్‌ కరణ్‌సింగ్‌ తనకు రాసిన లేఖకు తాను రాసిన ప్రత్యుత్తరం నకలును ఈ రాజీనామా లేఖకు జతచేశారు.‘‘నాపై చేసిన ఆరోపణలన్నీ పూర్తిగా అబద్ధం. నిరాధారమైనవి. పార్లమెంటరీ కమిటీకి కేంద్ర ఆర్థిక శాఖ తప్పుడు సమాచారం ఇవ్వడం నన్ను దిగ్ర్భాంతికి గురిచేసింది’’ అని ఆయన తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, తన ఆస్తుల వివరాలను వెల్లడించాల్సిందిగా సుప్రీంకోర్టు కొంత గడువు ఇచ్చినప్పటికీ, కోర్టు ఆదేశాలను మాల్యా బేఖాతరు చేయడంతో కేంద్రం ఆయన్ని ఉద్దేశపూర్వక ఎగవేతదారుగా ఖరారు చేసి స్వదేశానికి రప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. మొత్తానికి దేశం దాటిపోయాక అన్నిరకలా ఎత్తులు వేస్తూ , రోజుకో రకంగా స్టేట్ మెంట్స్ ఇస్తున్న మాల్యా ఆటలు సాగుతాయా , ఆగుతాయా చూద్దాం.

ఇవి కూడా చదవండి: చనిపోయిన గురువుని మమ్మీగా మార్చి పూజలు చేస్తున్న శిష్యులు!

ఇవి కూడా చదవండి:బికినీ ఫోజులతో హీటెక్కిస్తున్న రాధిక ఆప్టే

English summary

Vijay Mallya resigns from Rajya Sabha. Vijay Mallya sends letter to Rajaya Sabha Chairman Hameed Ansari from London.