గుజరాత్ నూతన సీఎం గా రూపాన్నీ ప్రమాణం

Vijay Rupani Nominated A New Gujarat Chief Minister

10:44 AM ON 8th August, 2016 By Mirchi Vilas

Vijay Rupani Nominated A New Gujarat Chief Minister

గుజరాత్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా విజయ్ రూపానీ ఆదివారం ప్రమాణస్వీకారం చేశారు. ఆనందీబెన్ రాజీనామాతో ఆమె వారసుడిగా బీజేపీ అధిష్టానం రూపానీకి గుజరాత్ పగ్గాలు అప్పగించింది. గాంధీనగర్లోని మహాత్మా మందిర్లో రూపానీతో గవర్నర్ ఓపీ కోహ్లి ప్రమాణం చేయించారు. ఉప ముఖ్యమంత్రిగా నితిన్ పటేల్ తో పాటు, మరో 23 మంది మంత్రులు కూడా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ సీనియర్ నేత ఎల్.కె అద్వానీ, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. తెలంగాణ పర్యటన కారణంగా ప్రధాని మోడీ ఈ కార్యక్రమానికి వెళ్లలేకపోయారు. కాగా వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీని విజయతీరాలకు నడిపించే బాధ్యతను రూపానీపై పెట్టింది. పటేళ్లు ఆందోళన చేస్తున్న సమయంలో ఆ వర్గానికి చెందిన సీఎం తప్పుకున్నా, ఓ జైన్ సామాజిక వర్గానికి బాధ్యతలు అప్పగించి కొత్త సమీకరణానికి బీజేపీ తెర తీసింది.

ఇవి కూడా చదవండి: నీతా అంబానీ అరుదైన రికార్డు

ఇవి కూడా చదవండి:డబ్బున్న మంత్రుల్లో నెంబర్ వన్ ఈయనే..

English summary

Vijay Rupani has selected as a new Chief Minister of Gujarat. BJP senior leaders L.K.Adwani, Arun Jaitley were attend to this event.