బాబు ఎప్పుడూ అందమే... పుత్రోత్సాహం

Vijaya Nirmala sensational comments about Mahesh Babu

09:30 AM ON 9th May, 2016 By Mirchi Vilas

Vijaya Nirmala sensational comments about Mahesh Babu

ఏ తండ్రికైనా ఆనందం, సంతోషం ఎప్పుడంటే కొడుకు మంచి పొజిషన్ లో ఉన్నప్పుడే కదా.. ఒకప్పటి సూపర్ స్టార్ నట శేఖర్ కృష్ణకు అలాంటి ఆనందం కలుగుతోంది. పుత్రోత్సాహంతో ఉప్పొంగిపోతున్నాడు. ఇంతకీ విషయమేమంటే, సూపర్ స్టార్ మహేష్ బాబు 'బ్రహ్మోత్సవం' మూవీ ఆడియో శనివారం సాయంత్రం రిలీజైంది. ఈ ఆల్బమ్ లోని ఫస్ట్ సాంగ్ ను సూపర్ స్టార్ కృష్ణ-విజయనిర్మల లాంచ్ చేశారు. ఈ సందర్భంగా విజయనిర్మల స్పీచ్ అందర్నీ ఆకర్షించింది. బాబు ఎప్పుడూ అందమే అన్న ఆమె మాటలు ఆకట్టుకున్నాయి. అనంతరం కృష్ణ మాట్లాడుతూ వరప్రసాద్ ఈ సినిమాని ఎంతో ప్యాషన్ తో నిర్మించారన్నారు. పీవీపీ తమకు అమెరికా, లండన్ లలో ఎంతో మంచి ఆతిద్యమిచ్చారని గుర్తు చేసుకున్నారు.

మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ పీవీపీ అన్నారు. 'ఎంతో గొప్పగా తీసుంటాడని నా నమ్మకం. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల చాలా నేచురల్ గా తీశాడు. అంత గొప్పగా తీశాడు. ఈ ట్రైలర్ చూడగానే ఎంతో బావుంది. ఎంతో అందంగా కనిపించాడు. బాబు ఎప్పుడూ అందమే. 'శ్రీమంతుడు' రికార్డ్ ని తిరగరాయాలని కోరుకుంటున్నా. పీవీపీకి చాలా డబ్బు తీసుకురావాలని ఆశిస్తున్నా' అంటూ కృష్ణ ఆనందంతో చెప్పాడు.

English summary

Vijaya Nirmala sensational comments about Mahesh Babu. Vijaya Nirmala said about Mahesh Babu in Brahmotsavam audio launch is that he is always beautiful.