గులాబి దళంలో  విజయరామారావు 

Vijaya Ramarao Joins In Trs Party

12:33 PM ON 4th January, 2016 By Mirchi Vilas

Vijaya Ramarao Joins In Trs Party

గత 20రోజులుగా ఊరిస్తున్న టిడిపి సీనియర్ నేత , మాజీ మంత్రి విజయరామారావు ఎట్టకేలకు టిఆర్ఎస్ గూటికి చేరారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా విజయరామారావుకు గులాబి కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టిడిపి హయాంలో విజయరామారావు ఖైరతాబాద్‌ నియోజకవర్గం నుంచి గెలుపొంది మంత్రిగా పనిచేసిన విజయరామారావు ఇటీవల టిడిపికి రాజీనామా చేసినట్లు ప్రకటించడం , కెసిఆర్ తనయుడు కెటిఆర్ ఆయనతో భేటీ కావడం , టిఆర్ఎస్ లో చేరనున్నట్లు ప్రకటించడం తెల్సిందే. అయితే ఆ తర్వాత బాబు గారి నుంచి ఫోన్ రావడంతో టిఆర్ఎస్ లో చేరిక కు బ్రేక్ పడినట్లు వార్తలు పోక్కాయి. ఇక గ్రేటర్ ఎన్నికల సందడి కూడా మొదలు కానున్న నేపధ్యంలో విజయ రామారావు మొత్తానికి గులాబి దళంలో చేరిపోయారు. సైకిల్ దిగి కారు ఎక్కే బ్యాచ్ ఇంకా ఉన్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

English summary

Telangana Telugu Desam Party(TDP) Leader Vijaya ramarao joins in Trs party. Telangana Cheif Minister Kcr invites him to Trs party