విజయదశమి దేనికి సంకేతమో తెలుసా?

Vijayadasami deniki sankethamo telusa

12:18 PM ON 10th October, 2016 By Mirchi Vilas

Vijayadasami deniki sankethamo telusa

దసరా అంటే అందరికీ సరదా పండగే. పది రోజుల పండుగ అయిన దసరా సందర్భంగా అమ్మవారిని పూజిస్తాం. శ్రీ దేవి నవరాత్రులు నిర్వహిస్తాం. అమ్మవారిని శరన్నవ రాత్రులలో రోజుకో అలంకారంతో పూజిస్తారు కదా. చివరిరోజు విజయదశమి. విజయాలకు గుర్తుగా, చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా విజయ దశమిని చెబుతారు.

1/4 Pages

1. మహిషాసురుని సంహారానికి గుర్తుగా...


ఇక అమ్మవారు మహిషాసురుడుని సంహరించి, దుష్ట సంహారం చేసి సాధించిన విజయానికి గుర్తుగా దశమి తిధి నాడు విజయదశమిగా జరుపుకొంటారు. బ్రహ్మదేవుని వరాల వలన వరగర్వితుడైన మహిషాసురుడు దేవతల్తో ఘోరమైన యుద్ధమి చేసి వారిని ఓడించి ఇంద్రపదవి చేపట్టాడు. దేవేంద్రుడు త్రిమూర్తులతో మొర పెట్టుకొనగా మహిషునిపై వారిలో రగిలిన క్రోధాగ్ని ప్రకాశవంతమైన తేజముగా మారింది. త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీరూపమై జన్మించింది. శివుని తేజము ముఖముగా, విష్ణు తేజము బాహువులుగా, బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె 18 బాహువులను కలిగి ఉంది. ఆమెకు శివుడు శూలమును, విష్ణువు చక్రమును, ఇంద్రుడు వజ్రాయుధమును, వరుణ దేవుడు పాశము, బ్రహ్మదేవుడు అక్షమాల, కమండలము హిమవంతుడు సింహమును వాహనంగాను ఇచ్చారు. ఇలా సర్వదేవతల ఆయుధములు సమకూర్చుకొని మహిషాసురుని సైన్యంతో తలపడి భీకరమైన పోరు సల్పింది. మహిషాసురుని తరఫున పోరు సల్పుతున్న ఉదద్రుడు, మహాహనుడు, అసిలోముడు, బాష్కలుడు, బిడాలుడు తదితరులను సంహరించిన తరువాత మహిషాసురునితో తలపుడుతుంది. ఈ యుద్ధములో ఆదేవి వాహనమైన సింహమూ శత్రువులను చీల్చి చెండాడింది. దేవితో తలపడిన అసురుడు మహిషిరూపము, సింహరూపము, మానవరూపముతో భీకరముగా పోరి చివరకు తిరిగి మహిషిరూపములో దేవిచేతిలో హతుడైనాడు. ఈ విధంగా అప్పటి నుండి మహిషుని సంహరించిన దినము దసరా పర్వదినంగా జరుపుకుంటాం.

English summary

Vijayadasami deniki sankethamo telusa