మెగా స్టార్ పాత్ర పోషించిన విజయ్ కాంత్

Vijayakanth Defeated In Tamil Nadu Elections

10:06 AM ON 20th May, 2016 By Mirchi Vilas

Vijayakanth Defeated In Tamil Nadu Elections

హీరోలందరికీ రాజకీయాలు కల్సి రావు. ఇప్పుడు తమిళనాట మరోసారి అదే జరిగింది . 2004లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పగ్గాలు చేపట్టిన వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై తర్వాతి ఐదేళ్లలో ఎన్నో అవినీతి ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వ వ్యతిరేకత కూడా బానే ఉన్నట్లుగా అంచనా వేశారు. మరోవైపు ప్రతిపక్షాలన్నీ ఏకమై మహాకూటమి కట్టాయి. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ మరోసారి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురాగలడా అని సందేహించారంతా. కానీ వైఎస్ అనూహ్యంగా మళ్లీ ముఖ్యమంత్రి అయ్యాడు. ఇక్కడ తేడా ఏంటో అందరికీ తెలుసు. మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేశాడు. ప్రతిపక్షాల ఓటు బ్యాంకును దెబ్బ తీసి తన ఖాతాలో వేసేసుకున్నాడు. ఆ ఎన్నికల్లో మహాకూటమి 2 శాతం లోపు ఓట్లతో అధికారానికి దూరమైంది. మరోవైపు చిరంజీవి పార్టీ 17 శాతం దాకా ఓట్లు సంపాదించింది. ప్రజారాజ్యం లేకుంటే ఈ ఓట్లలో చాలా వరకు మహాకూటమికి పడేవేమో. అధికారం వారికే దఖలు పడేదేమో. ఈ విషయం చాలా సార్లు అప్పట్లో టిడిపి నేతలు చెప్పుకొచ్చారు కూడా.

ఇవి కూడా చదవండి:పుదుచ్చేరి లో కాంగ్రెస్‌-డీఎంకే కూటమి

ఇప్పుడు ఈ గొడవంతా ఎందుకంటే, తమిళనాట విజయ్ కాంత్ సైతం ఈసారి అప్పటి చిరంజీవి పాత్రే పోషించాడు. చిరు స్థాయిలో కాకుండా ప్రభుత్వ వ్యతిరేక ఓటును బాగా చీల్చేశాడు. గత పర్యాయం డీఎంకేకు వ్యతిరేకంగా జయలలితతో జట్టు కట్టడం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు పూర్తిగా ఈ కూటమికే దఖలు పడింది. కానీ ఈసారి సీన్ రివర్స్ అయింది. గత ఎన్నికల అనంతరం కొన్ని నెలలకే జయకు టాటా చెప్పేసిన విజయ్ కాంత్.. ఈసారి డీఎంకే స్నేహహస్తం చాటినా అందుకోలేదు.

సొంతంగా అధికారంలోకి వచ్చేద్దామని.. ముఖ్యమంత్రి అయిపోదామని చిన్నా చితకా పార్టీల్ని కూడగట్టి ఓ కూటమి ఏర్పాటు చేశాడు. ఐతే ఆయన పార్టీ అభ్యర్థులకు ఓట్లయితే వచ్చాయి కానీ.. సీట్లు రాలేదు. స్వయంగా విజయ్ కాంత్ ఓటమి పాలయ్యాడు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేయడం వల్ల డీఎంకేకు గండి పడింది. జయకు లాభం చేకూరింది. మొత్తానికి తాను మునిగి.. డీఎంకేను కూడా ముంచేశాడు కెప్టెన్. గత పర్యాయం జయకు మిత్రుడిగా ఉండి ఆమె అధికారంలోకి రావడానికి సాయపడ్డ విజయ్ కాంత్.. ఈసారి శత్రువుగా మారి ఆమెకు సాయపడ్డాడు. కాబట్టి అమ్మ కెప్టెన్ కు రుణపడి ఉండాలి.

ఇక తిరుచందూరు నియోజకవర్గంలో మరో హీరో శరత్ కుమార్.. అన్నాడీఎంకె క్యాండిడేట్ గా పోటీ చేసినప్పటికీ వెనుకబడ్డాడు.

ఇవి కూడా చదవండి:అవకాశం ఇస్తానని తన ఇంటికి ఒంటరిగా రమ్మన్నాడు: అపరాజిత

ఇవి కూడా చదవండి: తమిళనాట జయకేతనం - సరికొత్త రికార్డు సొంతం

English summary

Hero turned politician Captain Vijaykanth was defeated in Tamilnadu elections and there were no single MLA was won in the elections.Vijaykanth's party was participated single in this 2016 elections.