అక్కడ జీరోగా మారిన హీరో సినిమా తెలుగులోకి

Vijayakanth Kashi Vishwanath movie in telugu after 10 years

10:36 AM ON 20th June, 2016 By Mirchi Vilas

Vijayakanth Kashi Vishwanath movie in telugu after 10 years

తమిళనాట విజయ్ కాంత్ రాజకీయాల్లో కొంత వరకు సక్సెస్ అయినట్లే కనిపించాడు కానీ.. గత ఎన్నికల సందర్భంగా సాధించిన ఫలితాలు చూసి విజయ గర్వం తలకెక్కి.. ఐదేళ్లు తిరిగేసరికి జీరో అయిపోయాడు. 28 సీట్లు గెలిచిన అతడి పార్టీ ఈసారి సున్నా చుట్టేసింది. కనీసం విజయ్ కాంత్ కూడా గెలవలేదు. దీంతో కెప్టెన్ సార్ ఫోకస్ తిరిగి సినిమాల మీద పడింది. ప్రస్తుతం ఆయన హీరోగా రెండు ప్రాజెక్టులకు సన్నాహాలు జరుగుతున్నాయి. సాధారణంగా సినిమా కెరీర్ ముగిసిపోయాక చాలామంది రాజకీయాల వైపు చూస్తారు. అలాగే రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిపోదామని వెళ్లి.. అక్కడ ఫెయిలైన వాళ్లు తిరిగి సినిమాల వైపు చూస్తారు.

మన దగ్గర చిరంజీవి అదే ప్రయత్నంలో ఉన్నాడిప్పుడు. మరి ఇప్పటికే తమిళనాట ఆ ప్రయత్నంలో బిజీ అయిన విజయకాంత్ ఈ ఏడాది ఆఖర్లో లేదా వచ్చే ఏడాది ఆరంభంలో కెప్టెన్ బ్యాంగ్ బ్యాంగ్ రీఎంట్రీ ఉంటుందని భావిస్తున్నారు. అయితే ఈ విషయంలో తమిళ జనాలు ఎగ్జైట్ కావడంలో ఆశ్చర్యమేమీ లేదు కానీ.. ఓ తెలుగు నిర్మాత కూడా అంతే ఎగ్జైట్మెంట్ తో ఎప్పుడో పదేళ్ల కిందట కెప్టెన్ చేసిన సినిమా ఇప్పుడు తెలుగులోకి అనువదించి రిలీజ్ చేయబోతున్నాడు. కెప్టెన్ సినిమాల్ని వదిలి పెట్టి రాజకీయ ప్రవేశానికి సిద్ధం అవుతుండడానికి ముందు పేరరసు అనే ఓ బ్రహ్మాండమైన యాక్షన్ సినిమా చేశాడు.

అప్పట్లో అది పెద్ద హిట్టే అయింది. దీన్ని కాశీ విశ్వనాథ్ పేరుతో ఇప్పుడు తెలుగులో విడుదల చేస్తారట. అయినా విజయ్ కాంత్ తమిళ సినిమాల్లో రీఎంట్రీ ఇస్తుండటం చూసి దశాబ్ధం కిందటి సినిమాను ఇప్పుడు తెలుగులో రిలీజ్ చేయాలనుకోవడంలో అర్ధం లేదని అప్పుడే కొందరు సినీ విశ్లేషకులు అంటున్నారు. అయినా మన వాళ్లకు ఎందుకు అంత దురద అంటున్నారు కూడా.

English summary

Vijayakanth Kashi Vishwanath movie in telugu after 10 years