విపక్షాలకు షాకిచ్చిన  'విజయకాంత్'

Vijayakanth Party To Participate Single In Elections

11:10 AM ON 11th March, 2016 By Mirchi Vilas

Vijayakanth Party To Participate Single In Elections

5రాష్ట్రాల్లో శాసన సభ ఎన్నికలు కొత్త కొత్త ట్విస్ట్ లకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా తమిళనాట రాజకీయాల్లో సాగుతున్న ఎత్తులు పైఎత్తుల నాటకంలో పొత్తుల అంకానికి డీఎండీకే తెర దించేసింది. ప్రతిపక్షాల నుంచి విపరీతంగా వస్తున్న ఆహ్వానాలను పక్కకు నెట్టేసి, ఒంటరి పోరుకి సిద్ధమైంది. డీఎండీకే మహిళాదినోత్సవం సందర్భంగా పార్టీ అధినేత విజయకాంత్ ఈ విషయం తేల్చి చెప్పేసాడు. విజయకాంత్ పార్టీకి సీట్లు రాకున్నా ఓట్లు వున్నాయి. అందుకే, అధికార అన్నాడీఎంకే పొత్తుల పై నోరు మెదపకుండా గుంభనంగా వుండగా, బీజేపీ, డీఎంకే, ప్రజాస్వామ్య కూటమి డీఎండీకేతో స్నేహం కోసం విశ్వ ప్రయత్నం చేసాయి. బీజేపీకి చెందిన కేంద్రమంత్రులు పొన రాధాకృష్ణన, ప్రకాష్‌ జవదేకర్‌ రెండుమార్లు విజయకాంత్ని వాసానికి వెళ్లి మరీ చర్చలు జరిపారు. అదే విధంగా ప్రజాస్వామ్య కూటమి నేతలు సైతం విజయకాంత్ అనుగ్రహం కోసం ప్రయత్నాలు చేసారు. ఇక డీఎంకే అధినేత కరుణానిధి బహిరంగంగానే విజయకాంత్ ను పొత్తుల కోసం ఆహ్వానించారు.

ఎంతమంది ఎన్నిరకాలుగా ప్రయత్నాలు చేసినా, తన డిమాండ్ కి ఎవరూ సానుకూలంగా స్పందించక పోవడంతో విజయకాంత్ ఒంటర పోరు వైపు మొగ్గు చూపినట్లు భావిస్తున్నారు. తనను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని బీజేపీ నేతల వద్దా, ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని డీఎంకే నేతల వద్దా విజయకాంత్ డిమాండ్‌ చేసినట్టు కూడా ఇప్పటికే కథనాలు వెలువడ్డాయి. సీఎం అభ్యర్థిత్వం పై బీజేపీ తలొగ్గినా, డీఎంకే మాత్రం ఆయనకు నచ్చచెప్పేందుకు ప్రయత్నించినట్లు భోగట్టా. అయితే ఈ కథనాలపై ఇన్నాళ్లుగా నోరు మెదపని విజయకాంత్ గురువారం ఒంటరిపోటీ వైపు మొగ్గు చూపడం ద్వారా విపక్షాలకు షాకిచ్చాడు. విజయకాంత్ పార్టీ సింగిల్ గా బరిలో దిగితే, అటొచ్చీ, ఇటొచ్చీ అది అన్నాడిఎంకె పార్టీకే లాభిస్తుంది . బహుశా ఇది జయ లలిత వ్యూహంలో భాగమే కావచ్చునని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.

English summary

Veterean Hero Vijaykanth party Desiya Murpokku Dravida Kazhagam (DMDK) to participate single in upcoming Tamilbnadu Elections.This was said by DMDK president Vijaykanth.