దయనీయ స్థితిలో విజయకాంత్

Vijayakanth Was in Deep Confusion On Upcoming Tamil Nadu Elections

11:00 AM ON 22nd March, 2016 By Mirchi Vilas

Vijayakanth Was in Deep Confusion On Upcoming Tamil Nadu Elections

తమిళనాట ఎంజీఆర్‌గా నీరాజనాలు అందుకున్న డీఎండీకే అధినేత కెప్టెన్ విజయకాంత్‌ పరిస్థితి కొండనాలుకకు మందు వేస్తె ఉన్న నాలుక ఊడింది అన్న చందంగా దారుణంగా  మారింది. ముఖ్యంగా మే నెలలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయనున్నట్టు చేసిన ప్రకటన తర్వాత ఆయన పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారిపోయింది. చెన్నైలోని కోయంబేడులోని పార్టీ ప్రధాన కార్యాలయం బోసిపోయింది. ఆయన చుట్టూ ఈగల్లా ముసిరివుండే నేతలు ఒక్కొక్కరూ తుర్రున జారుకున్నారు. జాతీయ పార్టీలు , ప్రాంతీయ పార్టీలు కాళ్ళ దగ్గరకు వస్తే, చెట్టెక్కి కూర్చున్నాడు. కుదరదంటూ ఒంటరి పోరేనన్నాడు. ఇప్పుడు పరిస్థితి తలకిందులైంది.

హిందీ సాంగ్ ని కాపీ కొట్టిన దేవిశ్రీ

కావాలనే రోజాను జగన్ ఇరికించాడా...

విమానంలో పేలిన ఐఫోన్

సూపర్ స్టార్ కూతురు డాన్స్ అదిరింది

1/4 Pages

టిక్కెట్‌ వద్దు మహాప్రభో...

  నిన్న మొన్నటి వరకూ, విజయ్ పార్టీ పై మోజుతో,  పార్టీ టిక్కెట్ల కోసం పోటీ పడి దరఖాస్తు చేసిన నేతలు, తీరా ఇపుడు, తమకు టిక్కెట్‌ వద్దు మహాప్రభో- తమను వదిలిపెట్టండి అంటూ ప్రాధేయపడుతున్నరట. ఇక అస్సలు ప్రభావితం చూపని పార్టీలు సైతం,  విజయ్ చెంతకు చేరేందుకు ససేమిరా అంటున్నాయి. దీంతో విజయకాంత్‌ తీవ్ర నిరాశలో కూరుకుని పోయినట్టు వార్తలు వస్తున్నాయి.

English summary

Veteran Actor and DMDK party leader Vijaykanth was in deep confusion on Upcoming Tamilnadu Elections.Previously Vijaykanth announced that he was going to participate alone in Tamilnadu Elections.Now he was in deep confusion because of soo many of his party leaders were not willing contest in elections.