విజయరామారావు 'కారు' ఎక్కేసారు 

Vijayarama rao to join in TRS Party

03:46 PM ON 12th December, 2015 By Mirchi Vilas

Vijayarama rao to join in TRS Party

రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని, బద్ధ శత్రువులు సైతం కల్సిపోతారని ఇటీవల ఆపరేషన్ ఆకర్శ్ మరోసారి రుజువుచేస్తోంది. ఎపిలో కాంగ్రెస్ - వైసిపి నేతలకు టిడిపి గాలం వేస్తూ ,ఆ రెండు పార్టీలను నిర్వీర్యం చేయాలని వ్యూహం రచిస్తుంటే , మరోపక్క తెలంగాణాలో కూడా కాంగ్రెస్ - టిడిపిలను నీరుగార్చడానికి టిఆర్ఎస్ కృషి చేస్తోంది. ఎవరికెవరు తక్కువ కారని ఈ ఇద్దరు చంద్రులు నిరూపిస్తుంటే , ఏ చంద్రుడైతే ఏమిటి అనుకున్నారో ఏమో సిబిఐ మాజీ డైరెక్టర్ , టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి కె విజయరామారావు ఇప్పుడు సైకిల్ దిగి , కారు . ఎక్కేసినట్లే .. అదేనండి ఎక్కేసారు ... ఇక లాంచనంగా చేరడమే తరువాయి.

మిగితా వాళ్ళు చేరితే ఏమోగానీ విజయ రామారావు మాత్రం కెసిఆర్ పంచన చేరితే , అది నిజంగా అద్భుతమే. ఎందుకంటే , ఓ పార్టీ ఆవిర్భావానికి..ఓ రాష్ట్ర విభజనకీ కారణమైన వ్యక్తి విజయరామారావు. ఒకసారి గతంలోకి వెళితే , 1999 ఎన్నికల సందర్భంగా చంద్రబాబు విద్యావంతులు రాజకీయాలకు దూరంగా ఉండటం తప్పు..మేధావులంతా రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. తటస్థుల పేరిట చాలామందిని పార్టీ వైపు ఆకర్షించడంలో చంద్రబాబు పన్నిన వ్యూహం కలిసివచ్చింది. అలా టీడీపీ తీర్ధం పుచ్చుకున్న వారిలో మాజీ సిబిఐ డైరెక్టర్ కె విజయరామారావు కీలక వ్యక్టి.

విజయరామారావు టిడిపిలోకి వచ్చిందే తడవుగా ఖైరాతాబాద్ నియోజకవర్గం నుంచి పోటీచేసే చాన్స్ కూడా కొట్టేసారు. ఆనాటి ఎన్నికల్లో అప్పటి సిఎల్పీ నేత డాక్టర్ పి జనార్థనరెడ్డిని ఓడించి జైంట్ కిల్లర్ గా సన్సేషన్ క్రియేట్ చేసిన విజయరామారావు ఆ తర్వాత 1999లో చంద్రబాబు ప్రభుత్వంలో కేబినెట్ మంత్రి అయ్యారు.

విజయరామారావు మంత్రి అవ్వడమే టిడిపిలో చిచ్చుకు కారణమైంది. అదే మరి ట్విస్ట్. ఇప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, విజయరామారావు ఒకే సామాజిక వర్గం కావడం ఆల్రెడీ విజయరామారావు కేబినెట్ లో ఉండడంతో కేసీఆర్ ను కేబినెట్ నుంచి పక్కకు జరిపిన చంద్రబాబు తర్వాత డిప్యూటీ స్పీకర్ గా కెసిఆర్ ని నియమించారు.

అదండీ సంగతి .... ఇక దీంతో చంద్రబాబు - కెసిఆర్ ల మధ్య దూరం పెరిగి అది ఓ కొత్త పార్టీ ఏర్పాటుకు.. ఓ కొత్త రాష్ట్ర ఏర్పాటుకు కారణమైంది . ఆ రోజే కెసిఅర్ కి మంత్రి పదవి వచ్చివుంటే , ఉమ్మడి ఆంద్ర ప్రదేశ్ పరిస్థతి మరోలా వుండేది అనడంలో సందేహం లేదు.

అయితే ఇప్పుడు విజయరామారావు టీఆర్ఎస్ లో చేరబోతున్నారు. టి మంత్రి కె టి ఆర్ శనివారం విజయరామారావు ని కలిసారు. సిఎమ్ కెసిఆర్ తో కల్సి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు విజయరామారావు చెప్పారు. అయితే అదే సమయంలో టిడిపి నేత ఎర్రబిల్లి దయాకరరావు మాట్లాడుతూ విజయరామారావు టిదిపిలోనే వున్నారని చెప్పుకొచ్చారు. అయితే నిన్ననే టీడీపీకి తన రాజీనామా లేఖను ఫ్యాక్స్ ద్వారా పంపించినట్లు విజయరామారావు చెప్పారు.

English summary

Telugu desam party senior leader vijayarama ram to join in trs party. Vijaya rama rao was the ex-minister of united andhra pradesh