చిరు సరసన విజయ శాంతి

Vijayashanthi Reentry in Chiru 150th Movie

10:35 AM ON 14th July, 2016 By Mirchi Vilas

Vijayashanthi Reentry in Chiru 150th Movie

అసలే మెగాస్టార్ మూవీ ... ఇక ఒకప్పటి జోడీ, లేడీ అమితాబ్ జత కడితే ఇక ఆ కిక్కే వేరబ్బా ... అవును, ఫుల్ స్వింగ్ లో ఉన్న మెగాస్టార్ చిరంజీవి 150వ మూవీ షూటింగ్ కొత్త పుంతలు తొక్కుతోంది. ఇక త్వరలో రెండో షెడ్యూల్ షూటింగ్ ప్రారంభించేందుకు యూనిట్ రెడీ అయిపోతోంది. ఇంకా ఈ మూవీ గురించి ఫైనల్ కావాల్సిన ఒకే ఒక పాయింట్ మిగిలి ఉందట. అదేమంటే, హీరోయిన్ గా ఎవరిని ఫిక్స్ చేస్తారనే విషయం. దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు కానీ.. ఇప్పుడు టాలీవుడ్ లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. అదే ఒకప్పటి సూపర్ హీరోయిన్ , ఆతర్వాత పొలిటీషియన్ గా మారిన విజయశాంతిని, చిరు 150 కోసం అడిగారని తెలియడం ఒక్కసారిగా కలకలం రేపింది. దీన్ని బట్టి ఈసినిమా రేంజ్ భారీగానే వుంటుందనే అంచనాలు రెట్టింపయ్యాయి.

తమిళంలో సూపర్ డూపర్ హిట్ అయిన కత్తి ఆధారంగా మెగాస్టార్ రీ ఎంట్రీతో వస్తున్న 150 వ మూవీలో ఓ స్పెషల్ కేరక్టర్ ఉందట. చిరంజీవితో పాటు దర్శకుడు వివి వినాయక్ కూడా ఈ రోల్ కి విజయశాంతి అయితే పర్ఫెక్ట్ సూట్ అవుతారని భావిస్తున్నారు. ఇదే విషయాన్ని ఆమెతో సంప్రదించి చెప్పారు కూడా. ఇక సినిమా యూనిట్ నుంచి అందుతున్న లీకులను బట్టి, విజయశాంతి ఈ అంశంపై పాజిటివ్ గానే రియాక్ట్ అయినట్టు వినిపిస్తున్నా, ఇంకా సైన్ చేయలేదని అంటున్నారు. గతంలో చిరు - విజయశాంతి అంటే సూపర్ డూపర్ హిట్ పెయిర్ గా ఉండేది. వీరిద్దరూ కలిసి నటించిన అత్తకు యముడు , అమ్మాయికి మొగుడు , పసివాడి ప్రాణం, గ్యాంగ్ లీడర్ వంటి సినిమాలు అన్నీ హిట్ కొట్టాయి.

అయితే గ్యాంగ్ లీడర్ షూటింగ్ టైమ్ లో కొన్ని తేడాలు రావడంతో కలిసి చేసేందుకు చిరు - విజయశాంతి అంగీకరించలేదని అంటారు. అయితే.. ముందుగా ఉన్న అగ్రిమెంట్ కారణంగా మెకానిక్ అల్లుడులో మాత్రమే చిరుతో కలిసి నటించిన విజయశాంతి, ఆ తర్వాత కెరీర్ కొనసాగించినా.. అప్పటికే లేడీ అమితాబ్ ఇమేజ్ సంపాదించుకుని.. ఫిమేల్ లీడ్ఓరియెంటెడ్ ఉండే సినిమాలే కొనసాగించింది. రాజకీయాల్లో చేరి, బిజెపి , టి ఆర్ ఎస్ , పార్టీల్లో కీలకంగా వ్యవహరించింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో వున్న ఈమె సినిమాలకు దూరంగా జరిగి అప్పుడే పుష్కరం అయింది. ఇక చిరు 150లో నటిస్తే రీ ఎంట్రీతో ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో మరి .

ఇది కూడా చూడండి: అక్కడికెళ్లి పోలీస్ కేసులో ఇరుక్కున్న టీవీ నటి శ్రీవాణి

ఇది కూడా చూడండి: ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలంటే...

ఇది కూడా చూడండి: భర్త లేకుండా హనీమూన్ కి వెళ్లిన భార్య.. ఎందుకో తెలుసా?

English summary

Vijayashanthi Reentry in Chiru 150th Movie.