'ఒసేయ్ రాములమ్మ' సీక్వెల్‌తో రీ ఎంట్రీ

Vijayashanthi to ReEnter into Movies

12:37 PM ON 4th May, 2016 By Mirchi Vilas

Vijayashanthi to ReEnter into Movies

ఆమధ్య లేడీ ఓరియంటెడ్ పాత్రలతో మెప్పించి , హీరోలకు దీటుగా రాణించి లేడీ అమితాబ్ గా పేరొందిన స్టార్ హీరోయిన్ విజయశాంతి ఇప్పుడు రీ ఎంట్రీ కోసం ఉవ్విళ్ళూరు తోంది. గ్లామర్ పాత్రలతో పాటూ హీరోయిజం వున్న పాత్రలతో తనకు తానే సాటి అన్పించుకున్న విజయశాంతి సినిమారంగంలో మకుటం లేని మహారాణిగా వెలిగిందనే చెప్పాలి. అయితే ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించి... మాటల తూటాలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్న ఈమె, రాజకీయాల్లో ఎంత వేగంగా పైకి వచ్చిందో అంతే వేగంగా అధఃపాతాళానికి వెళ్ళిపోయింది. అప్పటివరకూ టిఆర్ఎస్ లో ఓ వెలుగు వెలిగిన ఈమె ఉన్నట్టుండి ఆపార్టీతో విభేదించి, కాంగ్రెస్ పంచన చేరి పతనమైంది. అలాంటి రాములమ్మ ఇపుడు మళ్లీ వెండితెరపై రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. అదీ కూడా తన సినీ ఇమేజ్‌ను అమాంతం పెంచేసిన 'ఒసేయ్ రాములమ్మ' చిత్రం సీక్వెల్‌తోనే వెండితెరపై మళ్ళీ సత్తా చాటాలని గ్రాండ్ వర్క్ చేస్తోందట.

ఇవి కూడా చదవండి:ఉదయభాను వయసు ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే

ఇందుకోసం గత కొన్ని రోజులుగా ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల కధనం. ముఖ్యంగా ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెబ్తున్నారు. సినిమాలలో స్లిమ్‌గా కనిపించడానికి అవసరమైన కసరత్తులు మొదలెట్టిందట. ఈ సీక్వెల్ తో మళ్లీ తన దశ తిరిగిపోతుందనే గట్టి అభిప్రాయంతో ఈ మెదక్ మాజీ ఎంపీ ఉందట. పైగా, మాస్‌లో ఇమేజ్‌ను పెంచే సినిమా అయితేనే తన పొలిటికల్‌ కెరీర్‌ మలుపు తిరుగుతుందనే నమ్మకంతో ముందుకు సాగాలని పట్టుదలతో వుందట. అందుకే ఒసేయ్ రాములమ్మతో పాటు..మరో భారీ ప్రాజెక్టును విజయశాంతి అంగీకరించినట్టు ఫిలిం సర్కిల్స్ చెప్పుకుంటున్నారు. ఓ పక్క చిరంజీవి 150వ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తుంటే , విజయశాంతి కూడా ఒసే రాములమ్మ సీక్వెల్ ని నమ్ముకుని రీ ఎంట్రీకి సిద్ధపడుతోంది.

ఇవి కూడా చదవండి:అతన్ని చూసి పారిపోయిన హీరోయిన్

ఇవి కూడా చదవండి:పవన్ పెట్టుకున్న వాచ్ ఖరీదు ఎంతో తెలుసా?

English summary

Veteran Heroine VijayaShanti to re-enter into movies with the remake of "Osay Ravulamma"movie. She planning to give re-entry and doing exercises to look Slimmer in the movie.