టి కాంగ్రెస్ పగ్గాలు విజయశాంతికి

Vijayashanti elected as a T Congress president

03:56 PM ON 16th July, 2016 By Mirchi Vilas

Vijayashanti elected as a T Congress president

రాష్ట్ర విభజన చేసి, రెండింటికీ చెందిన రేవడిగా తయారయిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు పార్టీకి జవసత్వాలు కల్పించే విషయంపై నానా రకాలుగా కసరత్తు చేస్తోంది. ఇలాంటి విపత్కర సమయంలో పార్టీని ముందుకు నడిపేది ఎవరు? ఎవరి చరిష్మా ఎంతవరకు వర్కవుట్ అవుతుంది? వాటిని పార్టీ ఎలా వాడుకోవాలి? అనే విషయాలపై కాంగ్రెస్ పార్టీ పెద్దలు రకరకాల లెక్కలు వేస్తున్నారట. ముఖ్యంగా తెలంగాణా ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణాలో పవర్ ని అందిపుచ్చుకోడానికి కాంగ్రెస్ అన్ని ఎత్తులు వేస్తోంది. వచ్చే ఏడాది యూపీ, మరికొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి.

ఈ ఎన్నికల గురించి కాంగ్రెసు ఎంతగా ఆలోచిస్తున్నదో 2019లో తెలుగు రాష్ట్రాల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల గురించి కూడా అంతే ఆలోచిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పవర్ చేజిక్కించుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడున్న పెద్ద తలకాయలను మార్చి కొత్త పార్టీకి కొత్త నెత్తురు నింపితే... పార్టీకి కొత్త ఊపిరి వస్తుందని ఆ దిశగా విజయం సాధించవచ్చనేది ఢిల్లీ పెద్దల నమ్మకం. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న తరుణంలో యూపీకి కాంగ్రెస్ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సలహా మేరకు కొత్త అధ్యక్షుడిగా బాలీవుడ్ మాజీ సినిమా హీరో రాజ్ బబ్బర్ ను నియమించారు.

ముఖ్యమంత్రి అభ్యర్థిగా మాజీ సీఎం షీలా దీక్షిత్ ను ఓకే చేశారు. ఆయన సలహా మేరకే టి కాంగ్రెసు అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని మార్చి మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ను నియమించే ఆలోచన కూడా ఉందట. రాష్ట్రంలో కొందరు నాయకులు కాంగ్రెస్ నుంచి గులాబీ క్యాంపస్ కు వెళ్లిపోవడంతో టీఆర్ఎస్ తో కాంగ్రెస్ తలపడలేని స్థితి. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్సే అయినా రాష్ట్రం ఏర్పడినప్పటినుంచి జరిగిన పలు ఎన్నికల్లో డిపాజిట్లు కూడా సాధించుకోలేని పరిస్థితి. వచ్చే ఎన్నికల్లో కూడా ఉత్తమ్ కుమార్ నాయకత్వంలోనే పార్టీ ఉంటే విజయం కష్టం అన్న థోరణితో పార్టీ ఉంది..

మరో వైపు కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం అజర్ తో పాటు మల్లు భట్టి విక్రమార్క, గీతా రెడ్డి, డీకే అరుణ, షబ్బీర్ అలీ తదితరుల పేర్లు పరిశీలనలో ఉన్నాయట. ఇక షాకింగ్ న్యూస్ ఏంటంటే ఈ జాబితాలో ఒకప్పటి సూపర్ హీరోయిన్, మాజీ గత ఎన్నికల్లో ఓడిపోయిన విజయశాంతి పేరు కూడా ఉందట. ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి పార్టీతో ఏమాత్రం సంబంధాలు లేకుండా అజ్ఞాతంలో ఉండటంతో అసలు విజయశాంతి కాంగ్రెసులో ఉందా? అనే డౌట్ కూడా వచ్చింది. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఆమె కాంగ్రెసుతోనే కాదు, తెలంగాణతోనే సంబంధం లేనట్లుగా ఉంది.

గత రెండేళ్లలో ఏ ఎన్నికల్లోనూ పార్టీ తరపున ప్రచారంలో కనిపించలేదు. కనీసం వినిపించలేదు. ఎన్నికల ప్రచారానికి. పిలిచినా నో అందట. అటువంటి విజయశాంతి పేరు అధ్యక్ష పదవికి పరిశీనలో ఉందన్న విషయం ఆశ్చర్యం కలిగిస్తోందట. పనిచేసేవారికే పదవులు దక్కుతాయని పదే పదే చెబుతున్న అధిష్టానం.. విజయశాంతి కాంగ్రెస్ గెలుపు కోసం ఏ మాత్రం కష్టపడిందంటూ కొంతమంది అప్పుడే దుమారం రేపుతున్నారట. మరి ఇలాంటి సమయంలో టి కాంగ్రెస్ పగ్గాలు ఎవరికి అప్పగిస్తారో చూడాలి.

English summary

Vijayashanti elected as a T Congress president