అందుకే పిల్లల్ని కనలేదట.. షాకిచ్చిన విజయశాంతి!

Vijayashanti shokcing comments about children

10:46 AM ON 25th June, 2016 By Mirchi Vilas

Vijayashanti shokcing comments about children

ఇటు సినిమాల్లో అటు రాజకీయాల్లో విజయశాంతి రూటే వేరు. ఇక టాలీవుడ్ లో ఎంతోమంది హీరోయిన్లతో పోటీని తట్టుకుని దాదాపు 28 సంవత్సారాలు సినీ పరిశ్రమలో నిలదొక్కుకోవడం ఒక్క విజయశాంతికే చెల్లింది. చిన్న సినిమాల్లో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసి టాలీవుడ్ లో ఉన్న అగ్ర నటులు అందరితో నటించి హీరోలతో సమానంగా పారితోషకం తీసుకున్న ఏకైక నటి కూడా విజయశాంతి. అంతేకాదు, టాలీవుడ్ లో హీరోలు ఆధిపత్యం చలాయిస్తున్న సమయంలో ప్రతిఘటన, కర్తవ్యం, ఒసేయ్ రాములమ్మ.. ఇలా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు తీసి అందరికీ షాకిచ్చింది.

విజయశాంతి నటించిన కర్తవ్యం చిత్రానికి గాను జాతీయ అవార్డు అందుకున్నారు ఆమె. ఇక ఒసేయ్ రాములమ్మ సినిమాతో సౌత్ ఇండియన్ సినిమాలో తనకంటూ ఓ విపరీతమైన క్రేజ్ ను ఏర్పరుచుకుంది విజయశాంతి. 7 భాషల్లో దాదాపు 190 చిత్రాల్లో నటించిన రాములమ్మ మళ్లీ తనకు కరెక్ట్ స్క్రిప్ట్ దొరికితే మరోసారి కెమెరా ముందుకు రావడానికి సిద్ధంగా ఉందట. ఇక తాజాగా పుట్టినరోజు సందర్భంగా తన పర్సనల్ లైఫ్ గురించి కూడా కొన్ని ఆసక్తికరమైన విషయాలు నటి విజయశాంతి చెప్పుకొచ్చింది. 1990 సమయంలో టాలీవుడ్ లో అత్యధిక పారితోషకం తీసుకున్న హీరోయిన్ నేనేనని చెబుతూ, చిరంజీవి, బాలకృష్ణ వంటి అగ్ర హీరోలకంటే కూడా తాను ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న సంఘటనను గుర్తుకు చేసుకుంది.

ఓపిక, సహనం, మొండితనం, పట్టుదల, కమిట్మెంట్ ఉండబట్టే ఇన్ని సంవత్సరాలు రాణించగలిగానని అంటోంది. నాకు చాలా సింపుల్ గా ఉండటం అంటే ఇష్టం. పర్సనల్ లైఫ్ విషయంలో చాలా మంది హీరోయిన్ల జీవితాలు ట్రాజడీగా మిగిలిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే నేను మాత్రం వీటన్నింటికీ దూరంగా ఉండాలనకున్నా. అందుకే శ్రీనివాస్ ప్రసాద్ తో నా పెళ్ళి సింపుల్ గానే జరిగింది. సింపుల్ గా బతకడమంటేనే ఇష్టం. అందుకే బయట ఎక్కువ కనిపించం అంటూ చెప్పుకొచ్చింది. ఇవాళ నేను కన్న బిడ్డలు రేపు మంచి చేస్తారని గ్యారంటీ లేదు. అందుకే పిల్లలు వద్దనుకున్నాం.

ప్రజలే పిల్లలనుకున్నా. నా జీవితం ప్రజలకే అంకితం చేశా. వాళ్ల కోసమే బతుకుతా. వాళ్ళ కోసమే చచ్చిపోతా. అంటూ విజయశాంతి చేసిన వ్యాఖ్యలు నిజంగా అద్భతమని చెప్పాలి. ఇక రాజకీయాలు మురికి కాలువ లాంటివని తెలిసినప్పటికీ అందులోకి దిగక తప్పలేదు అంటూ తన రాజకీయ జీవితం గురించి కూడా కొన్ని విషయాలను తెలియజేసింది.

English summary

Vijayashanti shokcing comments about children