చంద్రబాబు హీరోగా 'చంద్రోదయం'

Vijayawada Corporator TO Make Movie On AP CM Chandrababu Naidu

10:50 AM ON 22nd July, 2016 By Mirchi Vilas

Vijayawada Corporator TO Make Movie On AP CM Chandrababu Naidu

ఫక్తు రాజకీయ నేత అయినా సినీ నేపధ్యం దండిగా గల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలన కథాంశంగా ఇప్పుడు ఓ సినిమా తెరకెక్కబోతోంది. చంద్రోదయం టైటిల్ తో వస్తోన్న ఈ సినిమాను విజయవాడ కార్పొరేటర్ కాకమాను మల్లిఖార్జున యాదవ్ నిర్మించడానికి ముందుకు రాగా, ఒంగోలుకు చెందిన పసుపులేటి వెంకటరమణ స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ చేయబోతున్నాడు.

ఈ మూవీలో చంద్రబాబు బాల్యం, విద్యాభ్యాసం, పొలిటికల్ ఎంట్రీ, రాజకీయనేతగా సిఎంగా పరిపాలనలతో పాటు చంద్రబాబులోని అన్నికోణాలను టచ్ చేస్తారని తెలుస్తోంది. ఆగస్టు 4న ఒంగోలులో ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభిస్తారు. ఇక చంద్రబాబు పాత్రలో ఎవరు నటిస్తారనే తేలాలి. మొత్తానికి చంద్రన్న హీరోగా ఓ సినిమా వస్తుండడం తెలుగు తమ్ముళ్లకు ఆనందమేగా... కాగా తారాగణం వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని దర్శక, నిర్మాతలు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి:ఛాన్స్ ఇస్తే చాలు చూపిస్తా ...

ఇవి కూడా చదవండి:సెట్ లోనే అసిస్టెంట్ ఇచ్చిన పేపర్లను గాల్లోకి విసిరేసిన నాగార్జున(వీడియో)

English summary

One of the Vijayawada Corporator was going to make movie on Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu life history.