సెలవు రద్దు చేసుకున్న సిపి 

Vijayawada CP Gowtham Saavang Cancels His Leave

12:21 PM ON 16th December, 2015 By Mirchi Vilas

Vijayawada CP Gowtham Saavang Cancels His Leave

మొత్తానికి విజయవాడ సిపి గౌతం సావంగ్ సెలవు రద్దు చేసుకున్నారు. కాల్ మనీ కేసు దృష్ట్యా సెలవు రద్దు చేసుకున్నారు. ఈ మేరకు డిజిపిని కోరినట్లు ఆయన ప్రకటించారు. కేసు తీవ్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెల్పారు. కాల్ మనీ కేసు దర్యాప్తు కొనసాగుతుందని ఆయన తెల్పారు. 15 రొజుల సెలవు పెట్టడం , గతంలోనే అనుమతి తీసుకున్నారని డిజిపి వివరణ ఇవ్వడం జరిగాయి. అయితే ఈకేసులో రాజకీయ వత్తిళ్ళ కారణంగానే సిపి సెలవుపై వెళుతున్నట్లు అనుమానాలు వచ్చాయి. చివరకు సెలవు రద్దు చేసుకోవడంతో కేసు వేగవంతం గా ముందుకు సాగే సూచనలు కనిపిస్తున్నాయి.

కాగా ఈ కేసులో ఇంకా పలు ఫిర్యాదులు వస్తున్నట్లు సిపి గౌతం సవాంగ్ తెల్పారు. ఇప్పటివరకు 75 మందిని అదుపులోకి తీసుకున్నట్లు సిపి చెప్పారు. ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెల్పారు. వేధింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. కాల్ మనీ వ్యవహారంపై రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు చేస్తున్నట్లు ఆయన తెల్పారు.

మరోపక్క ఉదాసీనంగా ఉన్న అధికారుల జాబితా కూడా రూపొందించి బదిలీ వేటు వేయనున్నారు. ఇప్పటికే విజయవాడ పటమట సి ఐ దామోదర్ ని ట్రాఫిక్ కి బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇస్తున్నట్లు చెబుతున్నారు. మరో ఆరుగురిపై వేటు పడే అవకాశం వుందని తెలుస్తోంది.

English summary

Vijayawada CP Gowtham Saavang has cancelled his 15 days leave because of call money case.