నన్ను తాకి చూడు తెలుస్తుంది..

Vijayawada rowdies warns Ram Ghopal Varma

02:39 PM ON 25th February, 2016 By Mirchi Vilas

Vijayawada rowdies warns Ram Ghopal Varma

ఏదో సంచలన వార్తలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే రాంగోపాల్‌ వర్మకి విజయవాడ రౌడీల నుంచి బెదిరింపులు వస్తున్నాయి. రాంగోపాల్‌వర్మ 'వంగవీటి' సినిమా పేరుతో కమ్మ-కాపు లమధ్య కులచిచ్చులతో తెలుగు రాష్ట్రాలకి వేడి పుట్టిస్తున్నాడు. దీంతో విజయవాడ రౌడీల నుండి బెదిరింపులు వస్తున్నాయట. ఈ వార్తని స్వయంగా ఆయనే ట్విట్టర్‌లో తెలియజేసారు.

ఇదిలా ఉండగా ఒకరోజు రాంగోపాల్‌ వర్మ ఆఫీసులో పనిచేసే ఉద్యోగి ఆయన్ని “ఇన్ని బెదిరింపులు వస్తున్నా ఈ సినిమా తీసి ప్రాణం మీదకి తెచ్చుకోవడం అవసరమా ?” అనడిగితే దానికి వర్మ చెప్పిన సమాధానం విని ఆ ఉద్యోగి షాక్‌ కి గురయ్యాడు. వర్మ ఏం చెప్పాడంటే “నా ఒంటి మీద ఈగ వాలితే దుబాయ్‌ నుంచి ప్లేన్లు దిగుతాయ్‌” అని. వర్మకి, ముంబాయి అండర్‌ వరల్డ్‌ కి లింకు ఉన్నాయన్న రూమర్లు గురించి అందరికి తెలిసిందే.

English summary

Some of Vijayawada Rowdies Calling To Varma And Giving Warning To Stop The Film Shooting but Varma Simply Rejects To All Counters and Given Strong Reply to all Of Them.