బడిలోనూ దోపిడీయేనా? (వీడియో)

Vijayawada school student robbed of gold chain

11:44 AM ON 20th June, 2016 By Mirchi Vilas

Vijayawada school student robbed of gold chain

అధిక ఫీజులతో విద్యాలయాల్లో దోపిడీ సాగుంతోందని ఇటీవల ఆందోళనలు ఊపందుకున్నాయి. అయితే ఇది అలాంటి దోపిడీ కాదండోయ్. అయితే ఏమిటో తెలుసుకుందాం. బర్త్ డే సందర్భంగా బంగారు నగలు ధరించి స్కూలుకు వచ్చిన ఐదో తరగతి విద్యార్థినికి మాయమాటలు చెప్పి ఆ నగలను ఓ కుర్రాడు దోచుకుపోయాడు. విజయవాడలో సినీ ఫక్కిలో జరిగిన దోపిడీ షాకింగ్ కి గురిచేసింది. సౌమ్య ప్రణవి అనే ఈ విద్యార్థినిని స్వయంగా ఆమె తండ్రి స్కూలు వద్ద దింపి వెళ్ళాడు. పాప స్కూలు లోపలి వెళ్తుండగా.. ఓ బాలుడు ఆమె వెనుకే వచ్చాడు. ఒంటిపై బంగారు నగలు ఉంటే ప్రిన్సిపాల్ తరగతి గదిలోకి రానివ్వరని, అవి తీసి తనకిస్తే భద్రపరచి ఆఫీసులో ఇస్తానని నమ్మబలికాడు.

సౌమ్య ఏదో చెప్పే లోగానే ఆ కుర్రాడు ఆ నగలతో పరారయ్యాడు. అయితే రెప్పపాటు కాలంలో జరిగిన ఈ దోపిడీ దృశ్యం స్కూల్లోని సీసీటీవీలో రికార్డయ్యింది. ఆ బాలుడి వయస్సు 14 లేదా 15 సంవత్సరాలు ఉండవచ్చునని, సాధ్యమైనంత త్వరలో అతడిని పట్టుకుంటామని పోలీసులు అంటున్నారు. కొసమెరుపు సౌమ్య ధరించి వచ్చిన నగల విలువ 5 లక్షలని చెబుతున్నారు.

ఇది కూడా చూడండి: బీడీలు కాల్చండి బాబులూ..

ఇది కూడా చూడండి: ఈ కుమారీకి ఒక్క బ్రేక్ ప్లీజ్

ఇది కూడా చూడండి: అడిగినంతా .. ఇస్తేనే ఒప్పుకునేది

English summary

Vijayawada school student robbed of gold chain.