చిరంజీవి అందులో బెస్ట్ ... పైగా మంచోడు

Vijayshanti Praises Chiranjeevi

12:51 PM ON 9th May, 2016 By Mirchi Vilas

Vijayshanti Praises Chiranjeevi

అబ్బో లేడీ అమితాబ్ విజయశాంతి ఉన్నట్టుండి మెగాస్టార్ చిరంజీవి పై పొగడ్తల వర్షం కురిపించింది. ఒకప్పుడు మహారాణిలా వెండితెరను ఏలి, ఇప్పుడు ఒసే రాములమ్మ సీక్వెల్ తో రీ ఎంట్రీ కోసం ప్రయత్నిస్తున్న విజయశాంతి అప్పట్లో మెగాస్టార్ చిరుతో సమానంగా చిందేసి అభిమానులకు పండగ చేసింది.1990ల్లోచిరు - విజయశాంతి లది క్రేజీ కాంబినేషన్. హీరోల్లో చిరంజీవికి - హీరోయిన్స్ లో విజయశాంతికి టాప్ రేంజ్ ఇమేజ్ అప్పట్లో ఉండేది. ఈ ఇద్దరూ కలిసి నటించే మూవీ పై ముందునుంచే అంచనాలు ఉండేవి. అలా వీరిద్దరూ కలిసి నటించిన సినిమాల్లో గ్యాంగ్ లీడర్ కు ప్రముఖమైన స్థానం ఉంటుంది.

ఇవి కూడా చదవండి:మూడు గంటలు పాటు ముద్దు పెట్టించుకున్న కాజల్

ఇప్పుడీ సినిమా రిలీజ్ అయ్యి పాతికేళ్లు పూర్తైంది. కొన్ని విషయాల్లో చిరంజీవికి సాటి రాగల వ్యక్తులు ఇప్పటికీ లేరు అని విజయశాంతి అంటోంది. 'డ్యాన్సులు చేయడంలో ఇప్పటికీ చిరంజీవిని ది బెస్ట్ అనాల్సిందే. ఇండియాలోనే బెస్ట్ డ్యాన్సర్ ఆయన. చిరంజీవికి పోటీ రాగల వాళ్లు టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా ఇప్పటికీ లేరు. ఈ తరంలో కొంతమంది హీరోలు డ్యాన్సులు బాగానే చేస్తున్నా.. చిరంజీవిలో ఉన్న స్పెషల్ స్టైల్ వీరిలో కనిపించదు. సొంతగా ఆయనకు ఉండే గ్రేస్ స్పెషల్ అస్సెట్.' అని విజయశాంతి తెగ పొగిడేసింది.

ఇవి కూడా చదవండి:17 ఏళ్లుగా మేడలో వున్న బులెట్ తొలగింపు

ఇక వ్యక్తిగా కూడా చిరు చాలా మంచి వాడని చెప్పిన ఆమె.. గ్యాంగ్ లీడర్ కోసం భద్రాచలం కొండ పాట షూటింగ్ చేస్తున్న సమయంలో 'కర్తవ్యం' చిత్రానికి ఉత్తమనటి అవార్డు వచ్చినట్లు తెలిసిందట. ఆ సాయంత్రమే పెద్ద పార్టీ అరేంజ్ చేసి చిరు ఫ్యామిలీతో పాటు గోవిందా - దివ్యభారతిలను కూడా చిరు పిలిచాడట. ఓ హీరోయిన్ కు అవార్డు వస్తే ఈ స్థాయిలో అభినందించడం చిరుకే చెల్లింది అని విజయశాంతి చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి:కారును ఓవర్ టేక్ చేసిన వ్యక్తిని చంపేసిన ఎమ్మెల్సీ కొడుకు

ఇవి కూడా చదవండి:వెంకీ @75 - పూరితో ఘర్షణ -2

English summary

Veteran Heroine and Politician Vijayshanti was now planning to give re-entry into films with "Osay Ravulamma" Sequel. Today Chiranjeevi and Vijayshanti's Gang Leader movie was completed 25 years. Se says that Chiranjeevi was best in the industry.