నాతో పోటీకి ఆలోచించాలి

Vijendar Singh Wins Over Samet Hyseinov

05:25 PM ON 21st December, 2015 By Mirchi Vilas

Vijendar Singh Wins Over Samet Hyseinov

డిసెంబర్‌ 19 వ తేదిన జరిగిన బౌట్లో భారత ఒలంపిక్‌ ఛాంపియన్‌ బాక్సర్‌ విజేందర్‌, బల్గేరియా ప్రొషెషనల్‌ బాక్సర్‌ హ్యూసెనోవ్‌ మధ్య పోటి జరిగింది. అంతకు ముందు విజేందర్‌ను ఎముకలు విరగొట్టి భారత్‌కు పంపిస్తానని హ్యూసెనోవ్ అన్నాడు. దానికి స్పందించిన విజేందర్‌ అతనిని ఎలా ఎదుర్కోవాలో తనకు తెలుసునని, అతనికి బాక్సింగ్‌ రింగ్‌ లోనే సమాధానమిస్తానని అన్నాడు.

వీరిద్దరి మధ్య మాటల యుద్దంతో ఈ పోటీ పై అందరిలోను ఆసక్తి నెలకొంది. 19 న జరిగిన పోటీలో విజేందర్‌ హ్యూసెనోవ్‌ ను ఓడించి తన సత్తా చాటాడు.

ఈ సందర్బంగా విజేందర్‌ మాట్లాడుతూ తనతో పోటీకి దిగే ముందు ప్రత్యర్ధులు ఆచితూచి మాట్లాడాలని అన్నాడు. హ్యూసెనోవ్‌ తో ఫైట్‌కు ముందు తాను అద్భుత ప్రదర్శన ఇవ్వాలని భావించినట్లు తెలిపాడు. సవాల్‌ విసిరినంత ఆట హ్యూసెనోవ్‌ లో లేదని అన్నాడు. వరసగా మూడు విజయాలతో ఈ సంవత్సరాన్ని ముగించినందుకు ఆనందంగా ఉందని విజేందర్‌ అన్నాడు.

English summary

Indian Boxer , Olympic Medal Winner Vijendar wins over Samet Hyseinov's . After that vijendar says that everyone should think once while fighting with him in the ring