24 ట్రిమ్మింగ్.. దర్శకుడుకి నచ్చలేదా?

Vikram K Kumar don't like to trim 10 minutes in 24 movie

09:46 AM ON 16th May, 2016 By Mirchi Vilas

Vikram K Kumar don't like to trim 10 minutes in 24 movie

ఒక్కోసారి దర్శకులు అనుకున్నది రాకపోయినా, హీరోలు విరుద్ధంగా ప్రవర్తించినా అదో ఇబ్బంది ఫీలవుతారు. ఇప్పుడు ‘24’ సినిమాకు దర్శకత్వం వహించిన విక్రమ్ కుమార్ పరిస్థితి అదేనట. వాస్తవానికి ఈ సినిమా తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే సినిమాలో నెగటివ్లు గురించి మాట్లాడాల్సి వస్తే ప్రతి ఒక్కరూ రొమాంటిక్ ట్రాక్ కు సంబంధించిన సన్నివేశాల గురించే మాట్లాడారు. ఈ విషయంలో అందరిదీ ఏకాభిప్రాయం కావడంతో సూర్య అప్రమత్తం అయిపోయాడు. రెండో రోజుకే 10 నిమిషాల దాకా ట్రిమ్ చేయించేశాడు. అయితే ఈ ట్రిమ్మింగ్ దర్శకుడు విక్రమ్ కుమార్ కు నచ్చలేదని అంటున్నారు.

ఎంతైనా తాను ఎంతో ఇష్టంగా తీసిన సన్నివేశాలు కదా. అందుకేనేమో ఈ కోత అతడికి నచ్చలేదట. ట్రిమ్మింగ్ గురించి మాట్లాడ్డానికి ‘24’ సహ నిర్మాత.. సూర్య కజిన్ జ్నానవేల్ రాజా ఫోన్ చేస్తే అసలు విక్రమ్ ఫోనే తీయలేదట. సినిమా పది నిమిషాలు ట్రిమ్ చేద్దాం అన్న నిర్ణయం తీసుకుని విక్రమ్ కు సమాచారం ఇచ్చాక మళ్లీ ఎడిటింగ్ కోసం పిలవడానికి అతడికి ఫోన్ చేస్తే అసలు రెస్పాండ్ కాలేదట విక్రమ్. దీంతో జ్నానవేల్ నేరుగా విక్రమ్ ఇంటికే వెళ్లాడట. ‘ఏం చేసుకుంటారో మీ ఇష్టం. ఇందులో నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు’ అంటూ విక్రమ్ ఖరాఖండిగా చెప్పేసి, ఇక ఆ ట్రిమ్మింగ్ ప్రాసెస్ లో ఏమాత్రం జోక్యం చేసుకోలేదట.

దీంతో జ్నానవేల్ రాజా అసిస్టెంట్ డైరెక్టర్లు.. ఎడిటర్ తో కలిసి ఆ ఎడిటింగ్ పనేదో ముగించాడట. విక్రమ్ వ్యవహార శైలిని కొందరు విమర్శిస్తుండగా.. ఓ దర్శకుడు తాను ఎంతో ఇష్టంగా తీసిన సన్నివేశాల్ని తొలగించడానికి ఇష్టపడకపోవడంలో ఆశ్చర్యమేమీ లేదని ఇంకొందరు అంటున్నారు. మొత్తానికి హిట్ సినిమాలో కోతలు, హీరో - దర్శకుల నడుమ విబేధాలు సృష్టించడం మామూలు విషయం కాదు.

English summary

Vikram K Kumar don't like to trim 10 minutes in 24 movie. 24 movie director Vikram K Kumar don't likes to trim 10 minutes in 24 movie.