విక్రమ్‌తో మహేష్‌, అల్లుఅర్జున్‌!

Vikram K. Kumar want to direct Mahesh and Bunny

01:22 PM ON 11th December, 2015 By Mirchi Vilas

Vikram K. Kumar want to direct Mahesh and Bunny

13బి, ఇష్క్‌ , మనం వంటి సూపర్‌హిట్‌ చిత్రాలతో టాలీవుడ్‌లో తనకంటూ మంచి గుర్తింపు పొందిన దర్శకుడు విక్రమ్‌ కె. కుమార్‌ ఇప్పుడు తాజాగా తమిళ స్టార్‌ హీరో సూర్యతో '24' అనే ఒక సైన్స్ ఫిక్షన్‌ చిత్రం తీస్తున్నారు. ఇది సమ్మర్‌లో విడుదల కానుంది. ఇటీవలే ఒక ఇంటర్య్వూలో ఒక పత్రిక వాళ్లు '24' చిత్రం అయిపోయాక మీరు ఏ హీరోతో తరువాత సినిమా చేయబోతున్నారు అని అడిగితే టాలీవుడ్‌ హీరోలైన సూపర్‌స్టార్‌ మహష్‌, అల్లుఅర్జున్‌లతో సినిమాలు చేయబోతున్నాని చెప్పాడు. అయితే అసలు, '24' చిత్రం విక్రమ్ మహేష్‌ తోనే చెయ్యాలనుకున్నారు కానీ మహేష్‌, '24' చిత్రంలో సెకండాఫ్‌ తనకు యాప్ట్‌ కాదని అంగీకరించలేదు.

అయితే విక్రమ్‌ మహేష్‌కి వేరే కథ వినిపించాడు, అది నచ్చడంతో మహేష్‌ విక్రమ్‌తో సినిమా చెయ్యడానికి అంగీకరించాడు. కానీ ప్రస్తుతం మహేష్‌ బ్రహ్మోత్సవం షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు, ఆ తరువాత మురుగదాస్‌ చిత్రంలో చేయబోతున్నాడు. మరో వైపు అల్లుఅర్జున్‌ ''సరైనోడు'' చిత్రంలో బిజీగా ఉన్నాడు, ఇది దాదాపు పూర్తికావొచ్చింది. దీని తరువాత బన్నీ మరే సినిమాకి అంగీకరించ లేదు. అంటే విక్రమ్‌ ముందు బన్నీతో ఒక చిత్రం తెరకెక్కించి ఆ తరువాత మహేష్‌తో చెయ్యనున్నాడన్న మాట.

English summary

Vikram K. Kumar want to direct Mahesh and Allu Arjun.