కొద్దిరోజుల్లో పెళ్లి పెట్టుకుని విక్రమ్ ని టెన్షన్ పెడుతున్న కూతురు!

Vikram's daughter engagement ring was missed

12:50 PM ON 3rd August, 2016 By Mirchi Vilas

Vikram's daughter engagement ring was missed

వైవిధ్య నటుడు విక్రమ్ కుమార్తె అక్షితకు- డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి మనవడు రంజిత్ కు ఇటీవల అంగరంగ వైభవంగా నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. ఆ నిశ్చితార్ధం వేడుకలో రంజిత్ తన కాబోయే భార్య చేతికి ఎంగేజ్మెంట్ రింగ్ తొడిగాడు. అయితే ఇప్పుడు అక్షిత విక్రమ్ ని టెన్షన్ కి గురి చేసింది. ఇంతకీ అక్షిత ఏం చేసింది? విక్రమ్ ఎందుకు టెన్షన్ పడుతున్నారు? అన్న విషయాలు తెలియాలంటే అసలు విషయంలోకి వెళ్లాల్సిందే.. అదేంటంటే అక్షిత ఎంగేజ్మెంట్ రింగ్ మిస్సయ్యింది. ఇంతకీ ఆ రింగ్ పడిపోయిందా? లేక ఎవరైనా దొంగిలించారా అనేది సస్పెన్స్. ఈ విషయమై విక్రమ్ కూడా ఉన్నతాధికారులకు దర్యాప్తు వేగవంతం చేయమని రిక్వెస్ట్ చేసినట్లు సమాచారం.

నిశ్చితార్థం ఉంగరం పోయినట్లు అక్షిత, విక్రమ్ లు మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మంగళవారం ఖాదర్ నవాజ్ ఖాన్ రోడ్డులోని ఓ ఐస్క్రీం పార్లర్ కు వెళ్లానని, తిరిగి వెళ్తుండగా చూసేసరికి చేతికి రింగ్ లేదని, దాని విలువ సుమారు రూ.12 లక్షలు ఉంటుందని ఫిర్యాదులో ప్రస్తావించింది అక్షిత. వెంటనే దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు, ఐస్ క్రీం పార్లర్ లోని సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించారు. వచ్చే ఏడాది వీళ్ల వివాహం జరగనుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

English summary

Vikram's daughter engagement ring was missed