మంత్రగాళ్లన్న అనుమానాంతో పళ్లూడ గొట్టారు...

Village people beats two persons

03:12 PM ON 3rd September, 2016 By Mirchi Vilas

Village people beats two persons

దేవుడు, దెయ్యాల గురించి తరచూ చర్చ జరుగుతూనే వుంది. ఎవరి నమ్మకాలు వారివి. అయితే, ఓడిశా రాష్ట్రంలో తాజాగా జరిగిన సంఘటన సంచలనం సృష్టించింది. మంత్రగాళ్లనే అనుమానంతో ఇద్దరు వ్యక్తుల పళ్లు ఊడగొట్టడంతోపాటు వారి చేత మలాన్ని తినిపించి, మూత్రం తాగించారట. ఓడిశా రాష్ట్రంలోని గంజాం జిల్లా పత్రాపూర్ బ్లాక్ పరిధిలోని ఎస్బీ జగ్ దేబ్ పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే... ఎస్బీ జగ్ దేబ్ పూర్ గ్రామంలోని ఓ కుటుంబానికి చెందిన ఇద్దరు పిల్లలు ఇటీవల మరణించారు. పిల్లల మృతికి గ్రామస్థులైన బసుదేవ్ నాయక్, బంచ్చానాయక్ లే కారణమని, వాళ్లిద్దరూ బొమ్మలతో చేతబడి చేశారని గ్రామస్థులు అనుమానించారు.

అంతే మంత్రగాళ్లనే అనుమానంతో గ్రామస్థులందరూ కలిసి బసుదేవ్ నాయక్, బంచ్చానాయక్ లను జంక్షన్ లోకి తీసుకొచ్చి, టపటపా వారి పళ్లు ఊడగొట్టారు. ఆపై వారి చేత మనిషుల మలాన్ని బలవంతంగా తినిపించి, మూత్రాన్ని తాగించారు. ఇంత జరిగినా బసుదేవ్ నాయక్, బంచ్చానాయక్ లు మాత్రం పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ముందుకు రాలేదు. ఫిర్యాదు స్వీకరించేందుకు గ్రామానికి వచ్చిన పోలీసు ఇన్ స్పెక్టరు సుజిత్ కుమార్ నాయక్ ను కలిసేందుకు కూడా బాధితులు భయపడ్డారు. ఓడిశా రాష్ట్రంలోమంత్రగాళ్లనే అనుమానంతో జరుగుతున్న దాడులను నిరోధించేందుకు ఓడిశా సర్కారు 2013లో ప్రత్యేకంగా చట్టం తీసుకువచ్చినా కనీసం ఫిర్యాదు చేసేందుకు బాధితులు ముందుకు రాకపోవడం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది.

ఇది కూడా చదవండి: వినాయక చవితికి 21 పత్రాలతో పూజ.. నిమజ్జనం వెనుక అసలు కధ తెలుసా?

ఇది కూడా చదవండి: పరోటాలు తినే పోటీ... 25 పరోటాలు తింటే భారీ ప్రైజ్ మనీ

ఇది కూడా చదవండి: 'జనతా' పై క్లారిటీ ఇచ్చిన కొరటాల శివ

English summary

Village people beats two persons