గ్రామస్థుల మధ్య కొట్లాటకు దారితీసిన సీరియల్!

Village people fights for Kiranmala serial

11:15 AM ON 22nd August, 2016 By Mirchi Vilas

Village people fights for Kiranmala serial

ఇదేమిటి అనుకుంటున్నారా? అవును మరి, టీవీ సీరియల్స్ కు ఇండియాలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఉదయం నుంచి న్యూస్ డిస్కషన్స్, సినిమాలు, డ్యూయెట్స్ తో సందడిగా ఉండే ఇల్లు సాయంత్రం అయితే చాలు నిశ్శబ్ధంగా మారిపోతుంది. సంవత్సరాల కొద్దీ సాగే సీరియల్స్ వంతు వస్తుంది. అత్తింట్లో కోడలు పడే కష్టాలతో, తాగుబోతు భర్త పెట్టే చిత్రహింసలతో ఇల్లంతా శోకసంద్రమవుతుంది. మగాళ్లకు తలపోటు, మహిళలది ఎప్పుడూ అదే రూటు. ఇలా సీరియల్స్ అనేవి మనుషుల భావోద్వేగాలను ఎంతగానో ప్రభావితం చేస్తాయి. భావోద్వేగాల వరకే పరిమితమైతే పర్వాలేదు కానీ ఘర్షణలకు, సంఘర్షణలకు దారితీస్తేనే అసలు సమస్య. బంగ్లాదేశ్ లో సరిగ్గా అదే జరిగింది.

1/4 Pages

బెంగాలీలో ప్రసారమయ్యే 'కిరణ్ మాలా' ధారావాహికకు ఇండియాలో చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. విశేష ఆదరణ పొందిన ఈ సీరియల్ ను బెంగాల్ సరిహద్దు ప్రాంతంలో ఉన్న బంగ్లాదేశీయులు కూడా విపరీతంగా వీక్షిస్తారు. అయితే సీరియల్ పై వీరు పెంచుకున్న ఈ అభిమానమే పెద్ద వివాదానికి దారితీసింది. ఈ సీరియల్ కు అక్కడ ఎంత క్రేజ్ ఉందంటే భారత్-పాక్ ఫైనల్ మ్యాచ్ జరిగితే టీకొట్లు, షాపుల దగ్గర నిలబడి ఎలా చూస్తారో అక్కడ కిరణ్ మాలాను అలా చూస్తారు. బంగ్లాదేశ్ లోని హబిగంజ్ జిల్లాలో బుధవారం సీరియల్ చూడటానికి జనం ఓ రెస్టారెంట్ దగ్గర పోగయ్యారు.

English summary

Village people fights for Kiranmala serial