'వినాయక గ్యారేజ్' ఇచ్చట అన్ని కోర్కెలు తీర్చబడును!

Vinayaka Garage

06:45 PM ON 6th September, 2016 By Mirchi Vilas

Vinayaka Garage

విద్యారంభంలో వచ్చే వినాయక చవితికి వుండే స్పెషాల్టీ వేరు. నిజానికి ఈ పండగంటే అందరికీ అమితమైన ఇష్టం. వినాయక చవితి వస్తుందంటే ప్రధానంగా యువకుల్లో ఎనలేని ఉత్సాహం పుట్టుకొస్తుంది. పండగ వచ్చిందంటే చాలు ఊరు, వాడ గణేష్ విగ్రహాలతో కళకలాడిపోతాయి. రకరకాల రంగు రంగుల వినాయకులను కొలువు దీరుస్తారు. డిఫరెంట్ గెటప్స్ లలో గణనాధుడు దర్శనమిస్తాడు. ఇక గత రెండేళ్ళనుంచి సినిమా ప్రభావం గణేశుడిఫై పడింది. ప్రస్తుతం ఈ ట్రెండ్ బాగా నడుస్తోంది. ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో అయితే చెప్పనక్కర్లేదు. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. గబ్బర్ సింగ్ సినిమా వచ్చినప్పుడు గబ్బర్ సింగ్ గెటప్ లో గణనాథుడు దర్శనమిచ్చాడు.

1/3 Pages

ఆ తర్వాత ప్రభాస్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ బాహుబలి రావడంతో ఈ స్టైల్ లో బొజ్జగణపయ్య బాహుబలి గెటప్ లో దర్శనమిచ్చాడు. ఇక ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎన్టీఆర్ మూవీ 'జనతా గ్యారేజ్' గురించి తెల్సిందే. ఇచ్చట అన్ని రిపేర్లు చేయబడును అనే ట్యాగ్ లైన్ తో కొరటాల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఈ పండగకు వచ్చిన సినిమా సందడి హాల్స్ లోనే కాదు, వినాయక చవితి పందిళ్లను తాకింది. జనతా గ్యారేజ్ ను జనాలంతా 'వినాయక గ్యారేజ్' గా మార్చేశారు.. అంతేకాదు ఆఖరికి ట్యాగ్ లైన్ కూడా 'ఇచ్చట అన్ని కోరికలు తీర్చబడును' అంటూ అదరగొట్టేస్తున్నారు వినాయక భక్తులు.

English summary

Vinayaka Garage