ట్రైలర్ తో దుమ్ము రేపుతున్న సంపూ

Vinodam 100% movie trailer

05:14 PM ON 17th February, 2016 By Mirchi Vilas

Vinodam 100% movie trailer

బర్నింగ్‌ స్టార్‌ సంపూర్ణేష్‌ బాబు హడావిడి మళ్ళీ మొదలైంది. మొన్న 'బాహుబలి' స్పూఫ్‌ వీడియోతో అలరించిన సంపూ ఇప్పుడు మళ్ళీ కొత్త సినిమా ట్రైలర్‌తో అదరగొడుతున్నాడు. సంపూర్ణేష్‌ బాబు, పృధ్వీరాజ్‌, సత్యం రాజేష్‌, సప్తగిరి, షకలక శంకర్‌, అశ్విని ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం 'వినోదం 100% '. శ్రీరామ్‌ మూర్తి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి శ్రీనివాసరావు నిర్మాత. కంప్లీట్ కామెడీ ఎంటర్‌టైనర్‌ గా తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్‌ కొద్ది సేపటి క్రితమే విడుదలై నవ్వుల పువ్వులు పూయిస్తుంది. ఈ చిత్రానికి సుభాష్‌ ఆనంద్‌ సంగీతం అందించారు.

English summary

Sampoornesh Babu latest movie is Vinodam 100%. In this movie Sathyam Rajesh, Shakalaka Shankar, Sapthagiri, Prudhivi Raj was acting in lead roles. This movie is directed by SriRam Murthy.