కేసిఆర్ యాగానికి రానున్న ప్రముఖులు -  పూర్ణాహుతిపైనే దృష్టి 

VIP's To Attend To Ayutha Maha Chandi Yagyam

01:01 PM ON 18th December, 2015 By Mirchi Vilas

VIP's To Attend To Ayutha Maha Chandi Yagyam

అయుత చండీ యాగానికి గతంలో అనేక యాగాలు చేసిన కెసిఆర్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గా వున్నసమయంలో వ్యక్తిగత హోదాలో అత్యంత వైభవంగా చేపట్టిన అయుత చండీయగానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. కెసిఆర్ సూచనల మేరకు పగడ్బందీ ఏర్పాట్లు అవుతున్నాయి. ఈ యాగానికి పలువురు ప్రముఖులు రానున్నారు. రాష్ట్రపతి , ప్రధాని , కేంద్రమంత్రులు , పలు రాష్ట్రాల సిఎమ్ లను , వివిధ రంగాల ప్రముఖులను ఆయన వ్యక్తిగతంగా ఇప్పటికే ఆహ్వానించారు. కొందరిని ఆహ్వానించడానికి సతీసమేతంగా వెళ్ళారు. డిసెంబర్ 23న మొదలయ్యే చండీయాగం 27వరకూ కొనసాగుతుంది. శృంగేరి పీఠం ఆశ్శీస్సులతో దాదాపు నాలుగువేలమంది పండితుల పర్యవేక్షణలో అయుత చండీయాగం నిర్వహించనున్నట్లు చెబుతున్నారు.

ఈ యాగానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.. గవర్నర్లు నరసింహన్ (తెలుగు రాష్ట్రాలు).. రోశయ్య (తమిళనాడు).. విద్యాసాగర్ రావు (మహారాష్ట్ర).. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. యోగా గురువు రవి శంకర్ గురూజీ , సుప్రీంకోర్టు న్యాయమూర్తులు.. హైకోర్టు ప్రధానన్యాయమూర్తితో పాటు.. పలువురు జడ్జిలు ఈ కార్యక్రమానికి హాజరు అవుతారని అంటున్నారు. ఇక.. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు వస్తున్నారు. యాగానికి వచ్చే ప్రముఖుల కోసం ఐదు హెలిప్యాడ్లు నిర్మిస్తున్నారు. పార్కింగ్ కోసం 15 వేల వాహనాలకు సరిపడా ఏర్పాట్లు చేస్తున్నారంటే, యాగం ఏ రేంజ్ లో జరగనుందన్నది ఈ ఏర్పాట్లు చూస్తేనే తెలుస్తుంది.

అయితే ప్రముఖుల రాకపోకలపై ఇంకా స్పష్టత రానప్పటికీ, ముఖ్యలంతా యాగం చివరి రోజు డిసెంబర్ 27నే రానున్నట్లు చెబుతున్నారు. పూర్ణాహుతి కి జనం కూడా పోటెత్తనున్నారు.

యాగానికి వచ్చే ప్రముఖులు నిత్యం వస్తే, ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉండటంతో పాటు చివరి రోజు వస్తే యాగం ఫలం దక్కుతుందన్న నమ్మకం వలన, చివరి రోజున రావాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ తన మాటల్లోనే స్పస్టంచేసినట్లు వినికిడి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఆహ్వానించిన సందర్భంలో ఇన్విటేషన్ ఇచ్చిన కేసీఆర్.. రాష్ట్రపతితో పాటు పలువురు ప్రముఖులు చివరి రోజున వస్తున్నారని.. బాబు కూడా సతీసమేతంగా చివరిరోజు రావాల ని అనడమే ఇందుకు తార్కాణమని చెప్పవచ్చు.

శృంగేరి శారదా పీఠానికి కూడా కెసిఆర్ సతీసమేతంగా వెళ్లి పీఠాదిపతులను కూడా యాగానికి రావాలని ఆహ్వానించారు. మొత్తం మీద రోజుకు 50 వేల మందికి తక్కువ కాకుండా భోజనానికి వస్తారని అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నారంటే యాగం ఏ రేంజ్ లో వుంటుందో చెప్పనవసరం లేదు.

English summary

Cheif Minister of Telangana state KCR has conducting Ayutha Maha Chandi Yagyam which was going tobe start on 23 rd december and ends on 27 th december. Kcr invited soo many VIP's to this event including Pranab mukherjee, Narendra modi, Chandrababu naidu ets