ఆత్మహత్య చేసుకుని కోమాలోకి వెళ్ళిపోయింది.. ఈమె ఇప్పుడేం చేస్తుందో తెలిస్తే షాకౌతారు!

Virali Modi gets suicide two times

04:11 PM ON 4th October, 2016 By Mirchi Vilas

Virali Modi gets suicide two times

మనిషి ఇక తాను వ్యర్ధమనే భావనకు పోతే, తీవ్ర డిప్రెషన్ కి గురవుతారు. కారణాలేమున్నా ఆత్మహత్యకు పాల్పడేవారి మనస్సు మాత్రం తీవ్ర మనోవేదనలో ఉంటుంది. అత్యంత డిప్రెషన్ లో ఉండి, భరించలేని మానసిక వేదనను వారు అనుభవిస్తారు. అయితే ఆ క్రమంలో ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు కోల్పోయిన వారి గురించి పక్కన పెడితే, ఆత్మహత్యకు పాల్పడి చివరి అంచు దాకా వెళ్లి, ప్రమాదకర పరిస్థితుల్లో ఆస్పత్రిలో చేరి, కోలుకునే వారిలో సదరు మానసిక వేదన తాలూకు ఛాయలు ఇంకా అలాగే ఉంటాయి. దాన్నుంచి వారు అంత త్వరగా బయట పడలేరు. ఆ ప్రయత్నం వారిని ఇంకా వెంటాడుతూనే ఉంటుంది.

దీంతో వారు మళ్లీ ఆత్మహత్యకు యత్నిస్తారు. అలాంటి వారు కోలుకుని మళ్లీ పునరుత్తేజంతో ముందుకు దూసుకెళ్లాలంటే చాలా కష్టమే. అయితే అలాంటి కష్టమైన అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేసింది ఆ యువతి. ఇంతకీ ఆమె ఏం చేసిందో తెలుసుకుందాం.. వివరాల్లోకి వెళ్తే..

1/5 Pages

ఆమె పేరు విరాళి మోడీ. ముంబై వాసి. సరిగ్గా పదేళ్ల కిందట అంటే అప్పుడామెకు 15 సంవత్సరాలు. పలు అనుకోని కారణాల వల్ల రెండు సార్లు ఆత్మహత్యకు పాల్పడింది. మొదటి సారి ఆత్మహత్యకు పాల్పడినప్పుడు సురక్షితంగానే దాన్నుంచి ఆమెను రక్షించారు. కానీ రెండో సారి కూడా ఆత్మహత్యకు పాల్పడినప్పుడు ఆమె పరిస్థితి తీవ్రతరమై ఆస్పత్రిలో చేరింది. ఆ క్రమంలో ఆమె కోమాలోకి వెళ్లింది. అలా చాలా రోజులు గడిచాయి. అయినప్పటికీ విరాళిలో ఎలాంటి చలనం లేదు.

English summary

Virali Modi gets suicide two times