కోహ్లీ నిజంగా 'బాహుబలే'

Virat Kohli as a Baahubali

11:35 AM ON 1st April, 2016 By Mirchi Vilas

Virat Kohli as a Baahubali

ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' చిత్రం దేశవాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా ఈ చిత్రానికి జాతీయ అవార్డు కూడా వచ్చింది. ఎక్కడ చూసిన ఈ సినిమా గురించే చర్చలు. ఇటీవలే తాజాగా తెలంగాణా అసెంబ్లీ లో కూడా బాహుబలి గురించి చర్చ వచ్చిందంటే 'బాహుబలి' చిత్రం ఏ స్ధాయికి వెళ్లిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఇప్పుడు తాజాగా భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ ని కూడా బాహుబలి గా పోలుస్తున్నారు. అవును ఇది అక్షరాలా నిజం. ఇంటెర్నెట్ లో విరాట్ కొహ్లీ ఫోటోలు 'బాహుబలి' అవతారంలో దర్శనమిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: భారత్‌-వెస్టిండీస్‌ మ్యాచ్‌ పై 4000 కోట్లు బెట్‌: దావూద్‌ ఇబ్రహీం

ఇది కూడా చదవండి: బికినీలో హీటెక్కిస్తున్న 'సర్దార్' భామ..

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ 'రీల్ బాహుబలి' అయితే విరాట్ కోహ్లీ మాత్రం 'రియల్ బాహుబలి' అని క్రికెట్ అభిమానులు వర్ణిస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు టీ20 వరల్డ్ కప్ టోర్నీ లో కోహ్లీ పాకిస్తాన్, ఆస్ట్రేలియ జట్ల పై తానే ఒంటి చేత్తో ఇండియా జట్టుని గెలిపించాడు. అందుకే అభిమానులు విరాట్ కొహ్లీని రియల్ బాహుబలితో పోలుస్తున్నారు. అంతే కాదు కోహ్లీ రెండో మ్యాచ్ పాకిస్తాన్ పై ఇండియా ని గెలిపించినప్పుడు ఇంత వరకు విడిపోయారానుకున్న అనుష్క శర్మ కోహ్లీ కి ఫోన్ చేసి నువ్వు నిజంగా సూపర్ అంతే... ఈ దూకుడు ఇలాగే కొనసాగించాలని కోరుకుంటున్నా అని చెప్పిందట.. అందుకే విరాట్ ప్రియురాలి కోసం మైదానంలో తనదైన శైలిలో రెచ్చిపోతున్నాడు.

1/4 Pages

English summary

Virat Kohli as a Baahubali. Team India crirkceter Virat Kohli as a Baahubali. Kohli fans are morphing his photos with Baahubali.