వరల్డ్ బెస్ట్ బ్యాట్స్‌మెన్‌ కోహ్లీ

Virat Kohli As World Number One T20 Batsman

11:25 AM ON 5th April, 2016 By Mirchi Vilas

Virat Kohli As World Number One T20 Batsman

భారత్ లోనే కాదు యావత్ ప్రపంచంలోనే విరాట్ కోహ్లీ వెలిగిపోతున్నాడు. ప్రపంచ టీ20 ఉత్తమ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో టీం ఇండియా మొదటి స్థానంలో నిలిస్తే , మరో శుభ వార్తగా సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ టీ20 బ్యాట్స్‌మెన్‌లో మొదటి స్థానంలో నిలిచాడు. ఆసిస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్‌ను వెనక్కు నెట్టి మరీ కోహ్లీ టాప్‌లో నిలిచాడు . విరాట్‌కు ప్రస్తుతం 892 పాయింట్లు ఉండగా, ఫించ్‌కు 868 పాయింట్లు ఉన్నాయి. టీ20ల్లో టాప్‌లో నిలిచిన కోహ్లీ వన్డే ర్యాంకింగ్స్‌లో సౌతాఫ్రికా ఆటగాడు డెవిలియర్స్ తర్వాత రెండో స్థానంలో నిలిచాడు. విరాట్ ప్రస్తుతం వరల్డ్ బెస్ట్ ఆటగాడిగా మన్ననలందుకుంటున్న నేపధ్యంలో కొత్తగా వరల్డ్ బెస్ట్ బాట్స్ మెన్ అయ్యాడు. దీంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

ఇవి కుడా చదవండి:

'ఊపిరి' చూసిన నలుగురు విద్యార్ధుల అరెస్టు

'సర్దార్‌' ఇంటర్వెల్‌ డైలాగ్‌ లీక్‌

విడుదలకు ముందే బాహుబలి రికార్డు బ్రేక్

సర్దార్ టికెట్ల కోసం ఇంటినే అమ్మేశాడు

నన్ను సీఎం లైంగికంగా వాడుకున్నారు

English summary

Indian Batsman Virat Kohli was in the top position in Icc T20 Rankings for the best batsman. Aron Finch was in Second Position.India Stand as number one team in Team Rankings