ఇండియా అభిమానులకు విరాట్ భలే బుద్ధి చెప్పాడు

Virat Kohli Asked His Fans To Chant For India

09:59 AM ON 25th March, 2016 By Mirchi Vilas

Virat Kohli Asked His Fans To Chant For India

సభల్లో నాయకులకు జిందాబాద్ లు కొడుతుంటే, కేవలం అధినేతకే జిందాబాద్ కొట్టాలి , లేదా పార్టీకి కొట్టాలి , అంతేకానీ వ్యక్తిగత నినాదాలు వద్దు అని చెప్పడం చూస్తుంటాం.. అది రాజకీయం ... కానీ ఇక్కడ రాజకీయం కాదు దేశభక్తి ... అవును నిజం .. అదేమంటే, టీ20 ప్రపంచకప్‌లోనే అత్యంత ఉత్కంఠ మ్యాచ్‌గా భారత్‌, బంగ్లాదేశ్‌ పోరు నిలిచిన సంగతి తెల్సిందే. అయితే ఆ సమయంలో చోటుచేసుకున్న ఓ ఆసక్తికరమైన అంశం తాజాగా వెలుగులోకి చూసింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 146 పరుగులు చేయగా.. లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్‌ ఒకానొక దశలో 6 బంతుల్లో 11 పరుగులే చేయాల్సి రావడంతో భారత్‌ అభిమానులు విజయంపై ఆశలు వదులుకున్నారు.

అయితే ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తరఫున ఆడుతూ అక్కడి అభిమానులకి కోహ్లి దగ్గరయ్యాడు. దీంతో కోహ్లీ పేరును ప్రస్తావిస్తూ స్టేడియంలోని ప్రేక్షకులు ‘కోహ్లి.. కోహ్లి’ అంటూ గట్టిగా అరుస్తూ కేరింతలు కొట్టారు . ఈ సమయంలో బౌండరీ లైన్‌ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న కోహ్లి తన జెర్సీపై ఉన్న ‘ఇండియా’ పేరును చూపిస్తూ తనకి కాదు దేశానికి మద్దతు తెలపాలని(ఇండియా అని అరవాలని) అభిమానులకి సంజ్ఞలు చేశాడు. తద్వారా భారత్ పట్ల దేశభక్తి ని మరోసారి చాటిచెప్పాడు. ఈ మ్యాచ్‌లో భారత్‌ చివరి వరకూ పోరాడి ఒక పరుగు తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. మొత్తానికి గర్వానికి పోకుండా ఈ గెలుపు భారత్ దే తప్ప తమది కాదంటూ కోహ్లీ అంటున్నాడన్న మాట ... గ్రేట్ కోహ్లీ ... గ్రేట్ ....

బిగ్ షాట్ వెంట వెళ్తున్న సూపర్ స్టార్ ....

ఫస్ట్‌నైట్‌ కు బెస్ట్‌ చిట్కాలు

English summary

Star Cricketer Virat Kohli asked his fans to Chant for India instead of Chant Him.He asked his fans during the match between India and Bangladesh match which was held on Banglore.