కోహ్లీ బర్త్ డే పార్టీ చూస్తే దిమ్మతిరిగిపోతుంది(ఫోటోలు)

Virat Kohli birthday party photos

10:59 AM ON 7th November, 2016 By Mirchi Vilas

Virat Kohli birthday party photos

అవును, పరుగుల రాజు కోహ్లీ తన పుట్టినరోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నాడు. టీమిండియా ఆటగాళ్లందరూ కలిసి కోహ్లీతో కేక్ కట్ చేయించారు. అయితే ఈ కేక్ ను కోహ్లీ జెర్సీ నెంబర్ ఆకారంలో తయారు చేయించారు. ఈ సందర్భంగా అంతా ఆ కేక్ ను కోహ్లీ ముఖానికి పూసి సెల్ఫీలు దిగారు. ట్విట్టర్లో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ల వరద పారింది. కోహ్లీ న్యూజిలాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ ను 3-0 క్లీన్ స్వీప్ చేసి జోష్ మీదన్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ తో జరగనున్న మొదటి టెస్ట్ మ్యాచ్ కోసం రాజ్ కోట్ లో ఉన్న కోహ్లీ అక్కడి స్టార్ హోటల్ లో బర్త్ డే జరుపుకున్నాడు. అంతేకాక తన గర్ల్ ఫ్రెండ్ అనుష్క శర్మ కూడా పక్కనే ఉంది.

ఇరువురు చేతిలో చేయి వేసుకుని మరీ హోటల్ కు వెళ్లారు. దీంతో ఈ బర్త్ డే విరాట్ కోహ్లీకి వెరీ స్పెషల్ గా మారింది. నెట్ లో ఫోటోలు హల్ చల్ చేస్తున్నాయి. ఇక కామెంట్స్ అదిరిపోతున్నాయి.

1/7 Pages

English summary

Virat Kohli birthday party photos