కోహ్లీ ఇల్లు కొన్నాడు .. ఖరీదు తెలిస్తే షాకే

Virat Kohli bought apartment for Rs 34 crore

10:46 AM ON 18th June, 2016 By Mirchi Vilas

Virat Kohli bought apartment for Rs 34 crore

భారత స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ మైదానం లోపలే కాదు.. బయటా రికార్డులు సృష్టిస్తున్నాడు. టీమ్ ఇండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి. అతను ముంబయిలోని వర్లి ప్రాంతంలో ఓ ఇల్లు కొనేశాడు. ధర ఎంతో తెలిస్తే షాక్ అయిపోతారు. ఏకంగా రూ.34 కోట్లు పెట్టి ఓ విలాసవంతమైన ఫ్లాట్ ను కొనుగోలు చేయడం విశేషం. గత ఏడాది రోహిత్ శర్మ ముంబయిలోనే రూ.30 కోట్లతో ఓ ఫ్లాట్ కొని రికార్డు సృష్టించాడు. ఆ ధరను కోహ్లి అధిగమించాడు. ఓంకార్ రియల్టర్స్ సంస్థ అరేబియా సముద్ర తీరానికి సమీపంలో మూడు భారీ టవర్లను నిర్మిస్తోంది. దక్షిణ ముంబై వర్లీ ప్రాంతంలోని ఓంకార్ 1973 ప్రాజెక్ట్ లో ఈ ఫ్లాట్ కొనుగోలు చేశాడు. ఇందులో టవర్ -సిలోని 35వ అంతస్తులో కోహ్లి 7,171 చదరపు అడుగుల ఫ్లాట్ ను సొంతం చేసుకున్నాడు. ఇంకా తుది రూపు సంతరించుకోని ఈ ఫ్లాట్ ను విశాలమైన ఐదు పడక గదులతో తీర్చిదిద్దే అవకాశముందట. విరాట్ ఫ్లాట్ నుంచి అరేబియా సముద్ర అందాలతో పాటు ముంబయి నగరమంతా కనువిందు చేస్తుందట. కోహ్లి, అతడి ప్రేయసి గత ఏడాదే ఇక్కడ ఫ్లాట్ కొనడానికి సంప్రదింపులు జరిపినా.. ఈ మధ్యే చెల్లింపులు జరిగాయట. లోపలి డిజైన్లన్నీ కోహ్లీ-అనుష్కా శర్మల అభిరుచి మేరకు కట్టించి ఇస్తారు. కాగా యువరాజ్ సింగ్ సైతం ఇదే టవర్లోని 29వ అంతస్తులో రెండేళ్ల కిందటే ఫ్లాట్ తీసుకున్నాడు. ఐతే అప్పటికి కోహ్లి కంటే తక్కువ ధరకే ఫ్లాట్ కొన్నట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చూడండి: శరీరం నీరు పడితే ఎలా తొలగించుకోవాలంటే ...

ఇది కూడా చూడండి: అక్కడ హిట్టయ్యి ఇక్కడ అట్టర్ ఫ్లాప్ అయిన తెలుగు సినిమాలు

ఇది కూడా చూడండి: ప్రపంచంలో భారత్ ని సగర్వంగా నిలబెట్టిన అరుదైన 12 అంశాలు

English summary

Virat Kohli is a famous indian cricketer. Virat Kohli buys new house in Mumbai for Rs 34 crore.