కోహ్లి ఛాలెంజ్‌ సూపరో సూపర్

Virat Kohli Cricket Challlenge Game

03:01 PM ON 19th December, 2015 By Mirchi Vilas

Virat Kohli Cricket Challlenge Game

టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ మాంచి దూకుడు మీద ఉన్నాడు. ఇటీవలే దక్షిణాఫ్రికాపై టెస్ట్ సిరీస్ గెలిచి మంచి ఊపుమీద ఉన్న ఈ యువ నాయకుడి జోరు మైదానంలోనే కాదు.. డిజిటల్‌ ఫ్లాట్‌ఫాంలోనూ కొనసాగుతోంది. డిసెంబర్‌ 14న విరాట్‌ క్రికెట్‌ ఛాలెంజ్‌ పేరుతో నజారా సంస్థ ఆన్‌లైన్‌లో మొబైల్‌ గేమ్‌ విడుదల చేసింది. అత్యంత స్వల్ప వ్యవధిలోనే ఇది గూగుల్‌ప్లే ఛార్ట్స్‌లో ఐదో స్థానంలోకి చేరడం విశేషం. అంతర్జాతీయంగా ప్రఖ్యాతి పొందిన క్యాండీ క్రాష్‌, టెంపుల్‌ రన్‌, క్లాష్‌ ఆఫ్‌ క్లాన్స్‌, సబ్‌వే సర్ఫర్స్ తర్వాతి స్థానంలో విరాట్‌ క్రికెట్‌ ఛాలెంజ్‌ నిలవడం గమనార్హం. ఒక భారతీయ గేమ్‌ ఈ స్థాయిలో విశేష ప్రాచుర్యం పొందండం కూడా ఇదే తొలిసారి. ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా శోధించిన ఆటగాడు విరాట్‌ కోహ్లినే అని గూగుల్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.

English summary

Virat Kohli's mobile game 'Virat Cricket Challenge', which was launched on December 14 has stood after the top games like Candy Crush, Temple Run, Clash of Clans, Subway Surfers on Google Play around the world