కోహ్లీ తాగే వాటర్ బాటిల్ ఖరీదు ఎంతో తెలుసా?

Virat Kohli drinking water bottle price

03:51 PM ON 11th July, 2016 By Mirchi Vilas

Virat Kohli drinking water bottle price

స్టార్ బ్యాట్సమెన్ మరియు టీమిండియా టెస్టు కెప్టెన్.. విరాట్ కోహ్లీ 2016 సంవత్సరంలో తన ప్రదర్శించిన అద్భుతమైన ఆటతో ఒక్కసారిగా తన సంపాదన తారా స్ధాయికి వెళ్లిపోయింది. వద్దన్నా కోట్ల రూపాయలు వచ్చి పడిపోయే పరిస్థితి ఏర్పడింది. కోహ్లీ సంపాదించడంలోనే కాదు.. జీవనశైలి ఖర్చు విషయంలో కూడా ఓ రేంజ్ లోనే ఉంది. కోహ్లీ ఇటీవలే అరేబియా సముద్ర తీరంలో దాదాపు నలభై కోట్ల రూపాయలు పెట్టి ఒక ఫ్లాట్ కొన్నాడు. తాను ఉండే అపార్ట్ మెంట్ లో నివాసం కోసమే అంత ఖర్చు పెట్టాడు అంటే.. కోహ్లీ జీవన శైలి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

మరి ఇంతగా సంపాదించేవాడికి లీటర్ నీళ్లకు 600 రూపాయలు పెట్టడం పెద్ద ఎక్కువేమీ కాదు! అయితే సగటు భారతీయుడి కోణం నుంచి ఆలోచిస్తే మాత్రం.. లీటర్ నీళ్లు 600 రూపాయలు అంటే ఆశ్చర్యపోక మానరు. కోహ్లీ ఎక్కడకు వెళ్లినా 'ఎవియాన్' అనే బ్రాండ్ మినరల్ వాటర్ తప్పనిసరిగా ఉండాలట. వీటి ధర లీటర్ కు ఆరువందల రూపాయలు. వీటిని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటారు. ఈ నీటిని అత్యంత లోతట్టు నుంచి మోటర్ల ద్వారా తవ్వితీసి గాలి కూడా తాకకుండానే ప్యాక్ చేస్తారట. దీని వల్ల ఈ నీటికి కాలుష్యం దరి చేరదు. ఇలాంటి నీటిని సేవించడం శరీరానికి మేలు చేస్తుంది అని వాళ్ళ నమ్మకం.

ఈ నీటిని కేవలం కోహ్లీనే కాదు.. అనేక మంది ధనవంతులు ఇలా విదేశాల నుంచి నీటిని దిగుమతి చేసుకుని తాగుతున్నారు.

English summary

Virat Kohli drinking water bottle price